Infinix Smart 8 Pro Launch : భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతంటే?

Infinix Smart 8 Pro Launch : 50ఎంపీ కెమెరా, 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సరికొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో మోడల్ లాంచ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Smart 8 Pro Launch : భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతంటే?

Infinix Smart 8 Pro With 50-Megapixel Camera, 5,000mAh Battery Launched

Infinix Smart 8 Pro Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స స్మార్ట్ 8 ప్రో మోడల్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ 8 సిరీస్‌ ఫోన్ లేటెస్ట్ 50ఎంపీ బ్యాక్ కెమెరాతో వస్తుంది. 6.6-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ36 ఎస్ఓసీ ద్వారా 8జీబీ వరకు ర్యామ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్)పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 10డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయగల 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Realme Note 50 Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి నోట్ 50 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ ఇన్ఫినిక్స్ వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 4జీబీ లేదా 8జీబీ ర్యామ్, 64జీబీ లేదా 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ వైట్, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 6,890 నుంచి ఉండవచ్చు. రాబోయే రోజుల్లో ఈ హ్యాండ్‌సెట్ ధర, లభ్యత గురించి పూర్తివివరాలను పొందవచ్చు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్ సిమ్ (నానో) ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) బయట రన్ అవుతుంది. 6.66-అంగుళాల హెచ్‌డీ + (720×1,612 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 500నిట్స్ గరిష్ట ప్రకాశంతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ36 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌‌‌‌తో వస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో మోడల్ ఎఫ్/1.85 ఎపర్చర్‌తో 50ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు ఎఫ్/2.0 ఎపర్చర్‌తో ఏఐ లెన్స్‌ను అమర్చింది. ఫ్రంట్ సైడ్ ఫోన్‌లో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Infinix Smart 8 Pro With 50-Megapixel Camera, 5,000mAh Battery Launched

Infinix Smart 8 Pro Launched

ఇన్పినిక్స్ స్మార్ట్ 8 ప్రోలో 128జీబీ వరకు స్టోరేజీని పొందవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 2టీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ ఎల్‌టీఈ, వై-ఫై5, బ్లూటూత్ 5, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి.

బోర్డులోని సెన్సార్‌లలో గైరోస్కోప్, ఇ-కంపాస్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. 10డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో మోడల్ కొలతలు 163.60×75.60×8.5ఎమ్ఎమ్, బరువు 189గ్రాములు ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Series : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ. 13వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?