Apple iPhone 15 Series : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ. 13వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 15 Series : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. అసలు ధరపై రూ. 13వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

Flipkart offering Rs 13k discount on iPhone, check
Apple iPhone 15 Series : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? లేటెస్ట్ ఐఫోన్ 15పై డిస్కౌంట్ కోసం వేచి చూస్తున్నారా? కొత్త జనరేషన్ ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని కేవలం రూ. 66,999కి పొందవచ్చు. సెప్టెంబర్ 2023లో లాంచ్ అయినప్పటినుంచి అసలు ధర రూ. 79,900 కన్నా చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్ ద్వారా ఐఫోన్ 15లో ఎక్కువ డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఐఫోన్ కొనుగోలుపై అదనపు విలువ కోసం పాత ఐఫోన్ లేదా ఏదైనా ఇతర అర్హత గల ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
Read Also : Apple iPhone 14 Sale : రూ.60వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 సేల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో మీరు 128జీబీ మోడల్‌ను కేవలం రూ. 66,999కి పొందవచ్చు. అసలు ధర కన్నా దాదాపు రూ. 13వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. 256జీబీ, 512జీబీ మోడల్‌లు కూడా వరుసగా రూ.76,999, రూ.96,999కి అమ్మకానికి ఉన్నాయి. మీరు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను ఉపయోగించడం ద్వారా మరింత ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ కార్డ్‌తో రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 54,990 వరకు తగ్గింపును అందిస్తోంది. మీరు అదనపు సౌలభ్యం కోసం.. నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు, యూపీఐ డిస్కౌంట్‌లను కూడా ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు, మీరు ఐఫోన్ 15 కోసం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 46149 తగ్గింపును పొందవచ్చు. మీ వద్ద ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్ ఉన్నప్పటికీ ట్రేడింగ్ చేయడం ద్వారా రూ. 20850 తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 15 మొత్తం పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ బ్లాక్ అనే 5 అద్భుతమైన కలర్ ఆప్షన్లలో వస్తుంది. అయినప్పటికీ, ప్రతి మోడల్‌కు అన్ని రంగులు స్టాక్‌లో లేవు. లభ్యతను బట్టి ధరలు మారవచ్చు.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
డిజైన్ – డిస్‌ప్లే : ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14 మోడల్ మునుపటి వెర్షన్‌లకు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడల్ ద్వారా మొదటిసారిగా సాధారణ నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్ పొందింది.
కెమెరాలు : ఐఫోన్ 15 మోడల్ కొత్త 48ఎంపీ ప్రధాన కెమెరా సెన్సార్‌తో మునుపటి కన్నా మెరుగైన కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 14లో 12ఎంపీ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఐఫోన్ 15 తక్కువ-కాంతి పరిస్థితుల్లో మెరుగైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు.

13k discount on iPhone
బ్యాటరీ : ఐఫోన్ 15లో ‘ఆల్ డే బ్యాటరీ’ ఉందని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఒక రోజంతా వస్తుందని ఆపిల్ తెలిపింది.
ప్రాసెసర్ : ఐఫోన్ 15 శక్తివంతమైన వేగవంతమైన ప్రాసెసర్ A16 బయోనిక్‌ను కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడల్ A15 బయోనిక్ చిప్‌ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ ఎ16 కన్నా తక్కువ సామర్థ్యంతో వస్తుంది.
ఐఫోన్ 15 టాప్ ఫీచర్లు :
డైనమిక్ ఐలాండ్ నాచ్ : ఐఫోన్ 15 కొత్త డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంది. అన్ని మోడళ్లలో అందుబాటులో ఉంది. ఈ మల్టీఫేస్ నాచ్ వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఫుడ్ ఆర్డర్‌లు, టాక్సీ రైడ్‌లను ట్రాక్ చేయడం వంటి పనులను పూర్తి చేయొచ్చు. డైనమిక్ ఐలాండ్ గతంలో ఐఫోన్ 14 ప్రో మోడళ్లకు ప్రత్యేకమైనది.
యూఎస్‌బీ టైప్ సి ఛార్జింగ్ : ఐఫోన్ 15 మోడల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను స్వీకరించింది. ఇతర డివైజ్‌ల ద్వారా విస్తృతంగా ఉపయోగంలో ఉంది. మీరు ఇకపై నిర్దిష్ట ఐఫోన్ ఛార్జర్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.
ఫోటోగ్రఫీ : కెమెరా చాలా మెరుగుపడింది. స్మార్ట్ హెచ్‌డీఆర్ మెరుగైన నైట్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారులు సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద 4కె వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఐఫోన్ 15 పోర్ట్రెయిట్ తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ వ్యూను మార్చడానికి యూజర్లను అనుమతిస్తుంది.