×
Ad

Black Friday Sale 2025 : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. ఈ S25 అల్ట్రా ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Black Friday Sale 2025 : శాంసంగ్ అభిమానుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.. డోంట్ మిస్ డీల్..

Black Friday Sale 2025

Black Friday Sale 2025 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోండి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్‌లు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో సహా లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే సరైన సమయం కావచ్చు. అన్ని బ్యాంక్ ఆఫర్లతో ఈ శాంసంగ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.24వేల భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఈ శాంసంగ్ ఫోన్ (Black Friday Sale 2025) దాదాపు రూ.1,29,999 ధరకు లాంచ్ అయింది. మెరుగైన డిజైన్, క్వాడ్ కెమెరా, అమోల్డ్ ప్యానెల్ S పెన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ధర వద్ద కచ్చితంగా కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధరల వివరాలపై ఓసారి లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ.20వేలు తగ్గిన తర్వాత రూ.1,09,999కి లిస్ట్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ లేదా ఎస్బీఐ బ్యాంక్ కార్డుల ద్వారా అదనంగా రూ.4వేలు సేవ్ చేసుకోవచ్చు. దాదాపు ధర రూ.1,05,999కి తగ్గుతుంది.

Read Also : Flipkart Black Friday Sale : ఆఫర్ అదిరింది బ్రో.. ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!

నెలకు రూ.3,868 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐతో ఈజీ ఈఎంఐలతో కూడా ఫోన్ కొనుగోలు చేయొచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్ ఆధారంగా నెలకు రూ.68,050 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఇంకా, కస్టమర్లు అదనంగా చెల్లింపుతో ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది.

45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా, అదనంగా 10MP 3x టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.