×
Ad

Black Friday Sale : బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు.. ఈ ఆపిల్ ఐఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఔట్‌స్టాండింగ్ డీల్స్ భయ్యా.. మీ బడ్జెట్ ధరలోనే..!

Black Friday Sale : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్లపై అద్భుతమైన డీల్స్.. ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 13 మోడళ్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Black Friday Sale

Black Friday Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లను అందిస్తోంది. అన్ని ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటివరకు బెస్ట్ డీల్స్ అందించాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా విజయ్ సేల్స్ కూడా ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 13పై అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది.

మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ డీల్స్ (Black Friday Sale) అసలు మిస్ చేసుకోవద్దు. ఈ సీజన్‌లో మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ కొనేసుకోండి.

విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 13 సేల్ :
భారతీయ మార్కెట్లో రూ.79,900 ధరకు లాంచ్ అయిన ఐఫోన్ 13 విజయ్ సేల్స్‌లో రూ.44,900కి అందుబాటులో ఉంది. అదేవిధంగా, ఐఫోన్ 15 విజయ్ సేల్స్‌లో రూ.55,690కి కొనుగోలు చేయవచ్చు. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ధర రూ.66,490కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.79,900 నుంచి తగ్గింపు పొందింది. మీరు ఎంట్రీ-లెవల్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెటర్ టైమ్. లేటెస్ట్ ఐఫోన్ 16 బ్యాంక్ ఆఫర్‌లతో రూ.5వేల వరకు ధర తగ్గింపు పొందవచ్చు.

Read Also : Black Friday Sale 2025 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? అమెజాన్‌లో 5 బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ మీకోసం.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్లలో ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 13 మొత్తం 3 మోడల్స్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్‌తో అందిస్తాయి. ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటాయి.

ఐఫోన్ 13 మోడల్ 12MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16లో 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్ 3 ఫోన్లలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్‌తో వస్తాయి. ఐఫోన్ 13 A15 ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. ఐఫోన్ 15 A16 చిప్‌సెట్‌ కలిగి ఉంది. ఐఫోన్ 16 ఆపిల్ A18 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఈ ఐఫోన్ వినియోగించుకోవచ్చు.