×
Ad

Black Friday Sale : భలే డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 35వేలు తగ్గింపు.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

Black Friday Sale : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరతో శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24

Black Friday Sale : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ గత ఏడాదిలో S24 సిరీస్ బేస్ వేరియంట్‌గా అందిస్తోంది. ఇందులో గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24 ప్లస్ వంటి మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

బ్లాక్ ఫ్రైడే సీజన్ సమయంలో ఈ శాంసంగ్ ఫోన్ (Black Friday Sale) లాంచ్ ధరపై భారీ తగ్గింపు అందిస్తోంది. మీరు భారీ డిస్కౌంట్‌లతో మంచి శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్..

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 బ్లాక్ ఫ్రైడే డీల్ :
భారతీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.40,999కు లభిస్తుంది. అసలు ధర రూ.74,999 లభిస్తోంది. అన్ని ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై రూ.4వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.36,999 తగ్గుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, మార్బుల్ గ్రే ఒనిక్స్ బ్లాక్ అనే 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Top Electric Scooters : డైలీ రైడింగ్‌కు పర్ఫెక్ట్.. 2025 టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. రేంజ్, పర్ఫార్మెన్స్ టాప్ లెవల్.. బెస్ట్ లిస్ట్ మీకోసం..!

శాంసంగ్ గెలాక్సీ S24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ బేస్ వేరియంట్‌లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 7 మెయిన్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S24 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ 3x జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 12MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. 4000mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.