Top Electric Scooters : డైలీ రైడింగ్‌కు పర్ఫెక్ట్.. 2025 టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. రేంజ్, పర్ఫార్మెన్స్ టాప్ లెవల్.. బెస్ట్ లిస్ట్ మీకోసం..!
Top Electric Scooters : ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. సిటీ రైడింగ్ కోసం కొత్త స్కూటర్ కావాలా? ఈ టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓసారి లుక్కేయండి.
Top 3 Electric Scooters in India 2025
Top Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? దేశీయ మార్కెట్లో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో సిటీ ప్రయాణాలకు సరిగ్గా సరిపోయే స్కూటర్లు ఇవి..
మార్కెట్ డిమాండ్ బట్టి ఎలక్ట్రిక్ స్కూటర్లు దాదాపు ప్రతి నెలా సెలబ్రిటీ మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి.
అందులోనూ ముఖ్యంగా (Top Electric Scooters) మైలేజ్, స్పీడ్ రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్, పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ కలిగిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లకే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. యువత నుంచి ఆఫీసుకు వెళ్లే వారి వరకు అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడుతున్నారు.
2025 ఏడాదిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం కూడా భారీగా పెరిగింది. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తుంటే మీకోసం ప్రస్తుతం మార్కెట్లో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లభ్యమవుతున్నాయి. అందులో రోజువారీ సిటీ రైడింగ్ నుంచి హైవే ప్రయాణాల వరకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే టీవీఎస్ ఎక్స్ ఈవీ, సింపుల్ డాట్ వన్, ఒకాయా ఫ్రీడమ్ ప్రో వంటివ ఈవీ స్కూటర్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేసుకోండి.
టీవీఎస్ ఎక్స్ ఈవీ :
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందరి వినియోగదారులకు అద్భుతంగా ఉంటుంది. సాధారణ వినియోగదారులకు సరైన స్కూటర్. ఇందులో స్పోర్టీ ఫ్రేమ్, బాడీ రైడింగ్ పొజిషన్ కలిగి ఉంది. రైడర్లకు బైక్ మాదిరి కంపర్ట్ అందిస్తుంది. ఇతర ఫీచర్ల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
కుదుపు లేకుండా గుంతల వీధులు, హైవేలపై హాయిగా వెళ్లొచ్చు. ఈ స్కూటర్ పవర్ ఛార్జింగ్ కూడా బాగుంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఉంటుంది. టీవీఎస్ సిటీ ప్రయాణాల్లో నావిగేషన్, కనెక్టివిటీ ఫీచర్లతో పాటు భారీ డిస్‌ప్లేలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
సింపుల్ డాట్ వన్ :
సింపుల్ డాట్ వన్ స్కూటర్ లాంగ్ రైడ్‌కు చాలా బెటర్.. ఇంజిన్ ట్యూనింగ్ కూడా అదుర్స్.. మంచి పవర్ ట్యూన్ కలిగి ఉంది. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి సరైన స్కూటర్. వాస్తవానికి ఈ స్కూటర్‌లో హై-ఎండ్ టెక్నాలజీ అంటూ లేదు. సింపుల్ లుక్ డిజైన్ పర్ఫార్మెన్స్ పరంగా పర్వాలేదు. 40 కి.మీ నుంచి 50 కి.మీ మెట్రో లాంటి ప్రాంతంలో ప్రయాణాలకు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసి సిటీ మొత్తం చుట్టేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. పదేపదే ఛార్జింగ్ కోసం ఆగాల్సిన అవసరం అవసరం ఉండదు.
ఒకాయా ఫ్రీడమ్ ప్రో :
ఈ ఓకాయా ఫ్రీడమ్ ప్రో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్. ఇతర ఈవీ స్కూటర్లతో పోలిస్తే ఫీచర్ల పరంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రత్యేకించి ఇందులో ఫంకీ లుక్స్ సిటీ ప్రయాణాలకు బాగా సెట్ అవుతుంది. సింపుల్ డాట్ వన్ టీవీఎస్ ఎక్స్ ఈవీలతో పోలిస్తే కొద్దిగా బెటర్‌గా ఉంటుంది.
అయితే, సిటీలోని సాధారణ ట్రాఫిక్‌లో తిరిగేందుకు ఈ ఒకాయా స్కూటర్ బెటర్ సరిగ్గా సరిపోతుంది. అయితే, ఒకాయా రేంజ్ ఓకాయా కన్నా టాప్ ప్లేసులో ఉంది. ముఖ్యంగా ధర పరంగా ఈ స్కూటర్ అత్యంత సరసమైనది. ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడే వినియోగదారులకు అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ టైమ్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
