గేమింగ్‌కు అనుగుణంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని భావిస్తున్నారా? అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి తెలుసుకోవాల్సిందే..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి.

స్ట్రాంగ్ ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్ అధికంగా ఉండడంతో పాటు గేమింగ్‌కు అనుగుణంగా ఉండే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని భావిస్తున్నారా? అయితే, బ్లాక్ షార్క్ 6 ప్రోపై ఓ లుక్కేయండి. మొబైల్ గేమింగ్‌ను ఇష్టపడేవారికి ఈ స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే ఇండియాలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

బ్లాక్ షార్క్ 6 ప్రో ఫీచర్లు
బ్లాక్ షార్క్ 6 ప్రోలో 6.81-అంగుళాల OLED డిస్ప్లే ఉంది. ఇందులో ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమ్‌లు ఆడుతున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే స్పీడ్ అధికంగా ఉంటుంది.

ఇక డిజైన్ విషయానికొస్తే.. బ్లాక్ షార్క్ 6 ప్రో ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ హై ఎండ్ గేమింగ్ ఫోన్‌ అని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్, బ్లాక్‌ ఫ్యాషన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటున్నారా?

ఫీచర్లు క్లుప్తంగా
డిస్ప్లే: 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల OLED
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Gen 2.
ర్యామ్, స్టోరేజ్: 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్
బ్యాక్ కెమెరాలు: 108MP + 12MP + 8MP లెన్స్‌, ట్రిపుల్ సెటప్
ఫ్రంట్ కెమెరా: 32MP
బ్యాటరీ: 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh సామర్థ్యం
ఆపరేటింగ్ సిస్టమ్: Android 13
కనెక్టివిటీ: 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C
భారత్‌లో ధర: సుమారు రూ.59,900