శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటున్నారా?
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, స్టైలిష్ లుక్స్‌తో ఉండే స్మార్ట్‌ఫోన్‌ను మీరు కొనాలనుకుంటే మీకు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 ఫోన్ బాగా నచ్చే అవకాశం ఉంది.
అంతేకాదు, ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో దాదాపు రూ.12 వేల డిస్కౌంట్‌తో దీన్ని కొనుక్కోవచ్చు. అలాగే, పలు బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 ఫోన్ 8 GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.28,999గా ఉంది. అమెజాన్‌లో దీనిపై 41 శాతం ఆఫర్‌తో రూ.16,999కే దీన్ని కొనుక్కోవచ్చు. అంటే, రూ.12 వేలు ఆదా చేసుకోవచ్చు.
అంతేగాక, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా రూ.1000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. మీరు మీ పాత ఫోనుని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,000 డిస్కౌంట్ కూడా ఉంది. రూ.824 ఈఎంఐ ఆప్షన్‌తోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 GEN 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్‌తో ఉంది. ఫొటోగ్రఫీ కోసం బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 50 ఎంపీతో, ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీతో ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో దీన్ని తీసుకొచ్చారు.