ఈ 6 టాప్‌ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న క్రేజే వేరు.. కొంటే వీటిలో ఒకటి కొనాలి.. ఏది కొంటారో మీ ఇష్టం..

ఈ స్మార్ట్‌ఫోన్లలో అధిక రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్‌లు, భారీ బ్యాటరీలు ఉన్నాయి.

ఈ 6 టాప్‌ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న క్రేజే వేరు.. కొంటే వీటిలో ఒకటి కొనాలి.. ఏది కొంటారో మీ ఇష్టం..

Updated On : May 3, 2025 / 6:19 PM IST

అన్ని రకాల ఫీచర్లు ఉండే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని అనుకుంటున్నారా? రూ.40,000లోపే ధర ఉంటే ఆ ఫోన్‌ను కొనేస్తారా? ఇటువంటి స్మార్ట్‌ఫోన్ల కోసం వెతుకుతున్న వారు ఐక్యూ నియో9 ప్రో, వన్‌ప్లస్ 13R, శాంసంగ్ గెలాక్సీ S24 FE, ఒప్పో Reno13 5G, హానర్ 200 ప్రో గూగుల్‌ పిక్సెల్‌ 8a గురించి తెలుసుకోవాల్సిందే. ఈ స్మార్ట్‌ఫోన్లలో అధిక రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్‌లు, బాగా రన్‌ అయ్యే ప్రాసెసర్‌లు, భారీ బ్యాటరీలు, మంచి పర్ఫార్మన్స్‌ ఉన్నాయి.

ఐక్యూ నియో9 ప్రో
ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది ఫిబ్రవరి 22న విడుదలైంది. దీని ధర 35,495. iQOO Neo9 Proలో 8GB RAM, 128GB స్టోరేజ్‌ ఉంటాయి. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ ఇందులో ఉంది. Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఇది వచ్చింది. 5160mAh బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉంది.

వన్‌ప్లస్ 13R
వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది జనవరి 7న లాంచ్ అయింది. దీని ధర రూ.39,999. ఇది 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6.78 అంగుళాల స్క్రీన్ AMOLED టెక్నాలజీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది, బ్యాక్ కెమెరాలు 50MP + 50MP + 8MP సెన్సార్‌లతో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16MPతో ఉంది. ఇందులో 6000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

Also Read: ఈ మూడు స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనేస్తారా?

శాంసంగ్ గెలాక్సీ S24 FE
శాంసంగ్ గెలాక్సీ S24 FE గత ఏడాది సెప్టెంబరు 27న విడుదలైంది. దీని ధర రూ.34,999. ఇది 8GB RAM, 128GB స్టోరేజ్‌తో లాంచ్ అయింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. 50MP + 8MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 10MP ఫ్రంట్ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇందులో 4700mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.

ఒప్పో Reno13 5G
ఒప్పో Reno13 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది జనవరి 9న విడుదలైంది. దీని ధర రూ.37,999. ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ 8GB RAMతో వచ్చింది. దీని 6.59-అంగుళాల AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5600mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.

హానర్ 200 ప్రో
హానర్ 200 ప్రో గత ఏడాది జులై 18న రూ.35,998 ధరకు విడుదలైంది. ఇది 12GB + 512GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. 50MP + 50MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరా కాన్ఫిగరేషన్, 50MP సెల్ఫీ షూటర్‌తో అందుబాటులో ఉంది. ఇందులో 5200mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.

గూగుల్‌ పిక్సెల్ 8a
గూగుల్‌ పిక్సెల్ 8a గత ఏడాది మే 7న విడుదలైంది. దీని ధర రూ.37,999. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. బ్యాంక్‌ సైడ్ 64MP + 13MP డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే 13MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 4492mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.