bluesky
Social Media X: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ విజయంలో ‘ఎక్స్’ అధిపతి ఎలాన్ మస్క్ కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ట్రంప్ కు భారీగా విరాళాలు అందజేయడంతోపాటు.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ పాల్గొన్నాడు. అయితే, డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత పెద్దెత్తున యూజర్లు సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినా ‘ఎక్స్’ను వీడుతున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మస్క్ ‘ఎక్స్’ను వినియోగించుకున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
Also Read: Donald Trump: దూకుడు పెంచిన ట్రంప్.. కీలక పదవుల్లో వరుసగా నియామకాలు.. పూర్తి జాబితా ఇదే..
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ను ముగ్గురు ప్రముఖ పాత్రికేయులు ఈ వారంలోనే వీడారు. చార్లీ వార్జెట్, న్యూయార్క్ టైమ్స్ మారా గే, మాజీ సీఎన్ఎన్ యాంకర్ డాన్ లెమన్ ఉన్నారు. వీరు బ్లూస్కై లో సభ్యులుగా చేరారు. మరోవైపు బ్రిటన్ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ సైతం ‘ఎక్స్’ వేదికగా ఎటువంటి పోస్టులు చేయబోమని ప్రకటించింది. ‘ఎక్స్’కు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘బ్లూస్కై’ థ్రెడ్స్ లలో ఎక్కువ మంది చేరినట్లు నివేదిలకు పేర్కొంటున్నాయి.
గడిచిన 90రోజుల్లోనే బ్లూస్కై లో యూజర్ల సంఖ్య రెండింతలు పెరిగింది. దీంతో వినియోగదారుల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంది. కేవలం ఒక్క వారంలోనే మిలియన్ కొత్త సైన్ అప్ లను బ్లూస్కై అందుకుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సేరి నవంబర్ 3న థ్రెడ్‌లు 275 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను అధిగమించినట్లు ప్రకటించారు.
మొబైల్ విభాగంలో .. బ్లూస్కై మొక్క ఐఓఎస్ యాప్ ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ లోని అన్ని ఉచిత యాప్ లలో చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. నంబర్ 1గా, ఇది థ్రెడ్‌లు, చాట్‌జిపిటి, గూగుల్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర ప్రసిద్ధ ఉచిత యాప్‌ల కంటే ముందుంది.
hello and welcome to the 1M people that have joined Bluesky in the last week!!!
join Bluesky: https://t.co/x6v5YW0WFTpic.twitter.com/WNHvHh8SvN
— bluesky (@bluesky) November 12, 2024