Boat Enigma Z20 Smartwatch : బ్లూటూత్ కాలింగ్‌తో బోట్ ఎనిగ్మా Z20 స్మార్ట్‌వాచ్, ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Boat Enigma Z20 Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో బోట్ ఎనిగ్మా Z20 స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో సరసమైన ధరకే అందుబాటులో ఉంది.

Boat Enigma Z20 With 1.5-Inch Display, Bluetooth Calling Launched in India

Boat Enigma Z20 Smartwatch : బోట్ ఎనిగ్మా Z20 స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. బోట్ నుంచి లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ 1.5-అంగుళాల రౌండ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. సాంప్రదాయ లగ్జరీ వాచ్ డిజైన్‌ను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Vivo Y28 5G Price in India : వివో Y28 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!

దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను అదనపు దృఢత్వం కోసం హై-టెన్సైల్ మెటల్‌ని ఉపయోగించి తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫంక్షనల్ క్రౌన్‌ను కూడా కలిగి ఉంది. మూడు స్ట్రాప్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వాచ్ ఫిట్‌నెస్ ట్రాకర్ల గ్రూపులో అనేక స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది.

భారత్‌లో బోట్ ఎనిగ్మా జెడ్20 ధర ఎంతంటే? :
బోట్ ఎనిగ్మా జెడ్20 లగ్జరీ స్మార్ట్‌వాచ్‌గా చెప్పవచ్చు. ఈ వాచ్ జెట్ బ్లాక్ రబ్బర్ స్ట్రాప్ ఆప్షన్ ధర రూ. 3,299కు పొందవచ్చు. మెటల్ బ్లాక్ స్ట్రాప్ లేదా బ్రౌన్ లెదర్ బెల్ట్ పొందాలనుకుంటే.. మీరు రూ. 3,499కు పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ అధికారిక స్టోర్, అమెజాన్ ఇండియా ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

బోట్ ఎనిగ్మా జెడ్20 స్పెసిఫికేషన్లు :
బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ రౌండ్ డయల్, టెన్సైల్ మెటల్ నిర్మాణంతో వస్తుంది. బోట్ ఎనిగ్మా జెడ్20 1.51-అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 360×360 రిజల్యూషన్, 600 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. 100+ వాచ్ ఫేస్‌లకు సపోర్టు ఇస్తుంది. డయల్ ఎడమ వైపున పని చేసే క్రౌన్ కలిగి ఉంటుంది.

Boat Enigma Z20 Launch

స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. క్విక్ డయల్ ప్యాడ్, వాచ్‌లో గరిష్టంగా 250 కాంటాక్టులను సేవ్ చేయగల సామర్థ్యం, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్‌ను పొందుతారు. హెల్త్ ట్రాకింగ్ పరంగా.. బోట్ ఎనిగ్మా జెడ్20 హార్ట్ రేట్ మానిటర్, ఎస్‌పీఓ2 డైలీ యాక్టివిటీ, బ్రీతింగ్ వంటి కలిగి ఉంటుంది. 100కి పైగా స్పోర్ట్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

బోట్ ఎనిగ్మా జెడ్20 స్మార్ట్‌వాచ్‌తో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, కెమెరా కంట్రోల్, ఫ్రీ బిల్ట్-ఇన్ గేమ్‌లు, మ్యూజిక్ కంట్రోల్, అలారం, కౌంట్‌డౌన్ టైమర్, ఫైండ్ మై ఫోన్, సెడెంటరీ అలర్ట్‌లు వంటి ఇతర ఫీచర్‌లను కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే.. బ్లూటూత్ కాలింగ్ డిసేబుల్‌తో 5 రోజుల వినియోగాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసిన రెండు రోజుల వరకు వాచ్‌ని ఉపయోగించవచ్చని బోట్ పేర్కొంది.

Read Also : Oppo Reno 11 Series India : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చేది ఎప్పుడంటే? కీలక స్పెషిఫికేషన్లు లీక్..!