Oppo Reno 11 Series India : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చేది ఎప్పుడంటే? కీలక స్పెషిఫికేషన్లు లీక్..!
Oppo Reno 11 Series India : భారత్ నుంచి ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో రెనో 11 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కీలక స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Oppo Reno 11 Series India Launch Date Tipped
Oppo Reno 11 Series India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో రెనో 11 సిరీస్ త్వరలో భారతీయ మార్కెట్లోకి రావచ్చు. టిప్‌స్టర్ ప్రకారం.. ఒప్పో రెనో 11, రెనో 11 ప్రో వచ్చే వారంలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్‌లు ఇప్పటికే చైనాలో అధికారికంగా లాంచ్ అయ్యాయి.
ఒప్పో ఇండియా కూడా రాబోయే రెనో 11 ఫోన్‌ల లాంచ్‌పై ఎలాంటి వివరాలను ఇవ్వనప్పటికీ, మలేషియాలోని తన అధికారిక వెబ్‌సైట్‌లో రెనో 11 సిరీస్ లాంచ్‌ను రివీల్ చేసింది. వెబ్‌సైట్ రెనో 11 సిరీస్ గ్లోబల్ వేరియంట్‌ల డిజైన్, ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడిస్తుంది. వనిల్లా ఒప్పో రెనో 11 చైనా వేరియంట్‌తో పోలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
Read Also : Oppo A59 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఒప్పో ఎ59 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం.. :
ఒప్పో రెనో 11 సిరీస్ భారత మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న లాంచ్ కానుందని సూచించారు. ఇదిలా ఉండగా.. ఒప్పో మలేషియా అధికారికంగా రెనో 11 సిరీస్ దేశంలో జనవరి 11న లాంచ్ కానుందని వెల్లడించింది. ఒప్పో ఇండియా వచ్చే వారం భారత మార్కెట్లో ఒప్పో ఫోన్‌ల లాంచ్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఒప్పో మలేషియా వెబ్‌సైట్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు, ఫోన్‌ల డిజైన్‌ను కూడా వెల్లడించింది.
ఒప్పో మలేషియా వెబ్‌సైట్‌లో టీజర్ ప్రకారం.. :
చైనా వేరియంట్‌తో పోల్చినప్పుడు.. వనిల్లా రెనో 11 కొద్దిగా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరోవైపు, రెనో 11 ప్రో అదే డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటాయి. కలర్ఓఎస్ 14పై రన్ అవుతాయని వెబ్‌సైట్ ధృవీకరిస్తుంది. ఒప్పో రెనో 11 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. అయితే, రెనో 11 ప్రో 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.

Oppo Reno 11 Series India Launch
ఒప్పో రెనో 11 సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఒప్పో రెనో 11 ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8200ఎస్ఓసీ, ప్రైమరీ 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరాలు, 4,800ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఒప్పో రెనో 11 ప్రో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కొంచెం పెద్ద 6.74-అంగుళాలను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ, సోనీ ఐఎమ్ఎక్స్890 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ వెనుక కెమెరాలు, 4,700ఎంఎహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి.
ఒప్పో రెనో 11 సిరీస్ ధర (అంచనా) :
మరోవైపు, ఒప్పో రెనో 11 సిరీస్ 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ ధర సీఎన్‌వై 2,499 (సుమారు రూ. 29వేలు) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ మోడల్, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ సిరీస్ ధర సీఎన్‌వై 2,999 (దాదాపు రూ. 35వేలు) ఉండవచ్చు.
Read Also : Vivo Y28 5G Price in India : వివో Y28 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!