World’s Largest iPhone : ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌ ఇదిగో.. గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది మనోడే..!

World's Largest iPhone : ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ స్కేల్-అప్ వెర్షన్ 6.74 అడుగుల ఎత్తులో రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

British YouTuber Of Indian Origin Builds World's Largest iPhone, Sets Guinness World Record

World’s Largest iPhone : భారత సంతతికి చెందిన బ్రిటిష్ యూట్యూబర్ అరుణ్ రూపేష్ మైనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ స్కేల్-అప్ వెర్షన్ 6.74 అడుగుల ఎత్తులో రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

Read Also : Vivo Y37 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో Y37 ప్రో ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ఈ బ్రిటన్ యూట్యూబర్ ‘మిస్టర్‌హూజ్‌దబాస్‌’ (Mrwhosetheboss) పేరిట టెక్ అప్‌డేట్స్ అందిస్తూ ఫుల్ ఫేమస్ అయ్యాడు. రివ్యూలు, వినూత్న టెక్నాలజీ కంటెంట్‌కు పేరుగాంచిన యూట్యూబర్ మైనీ.. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ స్కేల్డ్-అప్ వెర్షన్‌ను రూపొందించాడు.

ఈ ఘనతను సాధించడానికి, అతను గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ అయిన (DIYPerks)తో జతకట్టాడు. దీని అసలు పేరు మాథ్యూ పెర్క్స్. ఈ సహకారంతో ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ప్రతిరూపం మునుపటి రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది.

రెండు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న ఒక భారీ స్మార్ట్‌ఫోన్‌ను సృష్టించాడు. యూట్యూబ్‌లో టెక్నాలజీ సంబంధిత కంటెంట్‌లో అగ్రగామిగా రూపేష్ తన ఖ్యాతిని పెంచుకుంటూనే ఉన్నాడు.

ఈ అద్భుతమైన ఫీట్ సాధించడంపై తమ టీమ్, మాట్ ఇద్దరికీ చాలా గర్వంగా ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి చెప్పాడు. జీడబ్ల్యూఆర్ ప్రకారం.. అరుణ్ 2011లో యూట్యూబ్‌లో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు.

అతని టెక్ రివ్యూల కారణంగా పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ సంపాదించాడు. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్‌లలో ఆపిల్‌ తలదన్నేలా రూపేష్ ఈ పెద్ద ఐఫోన్‌ను రూపొందించాడు.

Read Also : iPhone 16 Pro Series : కొత్త ఐఫోన్ కావాలా? భారీ కెమెరాల అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. కీలక వివరాలు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు