BSNL 4G Service
BSNL 4G Service : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసు వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి బీఎస్ఎన్ఎల్ 4G సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ రంగ ఆపరేటర్ 98వేల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రతి రాష్ట్రంలోని వినియోగదారులకు హై-స్పీడ్ కనెక్టివిటీని తీసుకువచ్చింది. ఈ 4జీ సర్వీసుల ప్రారంభంతో బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు పాన్-ఇండియా 4G కవరేజీని అందించే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో ఒకటిగా నిలిచింది.
98వేల మొబైల్ టవర్లు ఏర్పాటు :
ఒడిశాలోని ఝార్సుగూడ నుంచి ఈ ప్రకటన చేసింది. ప్రధాని మోదీ అనేక ఇతర ప్రాజెక్టులను (BSNL 4G Service) కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ 26న, బీఎస్ఎన్ఎల్ తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 98,000 4G/5G మొబైల్ టవర్ల విస్తరణను ధృవీకరించారు. కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు సమీప భవిష్యత్తులో మరో లక్ష టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రైవేట్ నెట్‌వర్క్‌ల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ 4G పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై అభివృద్ధి చేశారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రెండూ భారత్‌లోనే అభివృద్ధి చేశారు. ఈ విజయంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా స్వావలంబన టెలికాం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన స్వీడన్, డెన్మార్క్, చైనా, దక్షిణ కొరియాతో పాటు టాప్ 5 దేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ స్వదేశీ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో ప్రభుత్వం రూ.37వేల కోట్లు పెట్టుబడి పెట్టింది.
యూజర్లకు మరెన్నో బెనిఫిట్స్, ధర ఎంతంటే?
బీఎస్ఎన్ఎల్ 4G ప్రారంభంతో 90 మిలియన్లకు పైగా సబ్‌స్ర్రైబర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌లు 30 నుంచి 40 శాతం చౌకగా ఉంటాయి. నెట్‌వర్క్ పరిమితుల కారణంగా గతంలో మారిన యూజర్లకు ఆకర్షణీయమైన ఆప్షన్. మెరుగైన కవరేజ్, స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్లకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ప్రైవేట్ ప్లేయర్‌ల నుంచి నంబర్ పోర్టబిలిటీని కూడా అందించనుంది.
భారత్‌లో 5G, 6Gకి రోడ్‌మ్యాప్ :
బీఎస్ఎన్ఎల్ కూడా 5G విస్తరణకు సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో చివరి నాటికి ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రారంభం కావచ్చు. 5G నెట్‌వర్క్ విస్తరణతో పాటు 2030 నాటికి 6G టెక్నాలజీ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది విజయవంతమైతే 6G సేవలను అందించే మొదటి దేశాలలో భారత్ ఒకటిగా మారనుంది.
In a landmark moment for Bharat’s telecom sector, and celebrating 25 glorious years of @BSNLCorporate, PM Shri @narendramodi ji will inaugurate India’s fully indigenous 4G stack and more than 97,500 Swadeshi BSNL towers across Odisha, Andhra Pradesh, Uttar Pradesh, Maharashtra,… pic.twitter.com/CZXtKMg48L
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) September 27, 2025
టీసీఎస్, తేజస్ నెట్‌వర్క్‌ల సహకారం :
ఈ నెట్‌వర్క్ విస్తరణకు ఇంటిగ్రేషన్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మద్దుతుగా నిలిచింది. తేజస్ నెట్‌వర్క్స్ రేడియో యాక్సెస్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఈ సహకారంతో బీఎస్ఎన్ఎల్ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా పూర్తిగా స్వదేశీ 4G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది.
రూ. 107కే 28 రోజుల వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ కేవలం రూ. 107. పూర్తిగా 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఏదైనా నెట్‌వర్క్‌కు 200 నిమిషాల కాల్స్, 28 రోజుల పాటు మొత్తం 3GB డేటాను అందిస్తుంది. తమ సిమ్‌ను యాక్టివ్ కోసం తక్కువ ధరకే రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ. 153కు 25 రోజుల ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 153 ప్రీపెయిడ్ రీఛార్జ్ కూడా అందిస్తోంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. ఈ రీఛార్జ్ MTNL ప్రాంతాలలో ఢిల్లీలో కూడా వర్క్ అవుతుంది. అదనంగా, వినియోగదారులు రోజుకు 100 SMS, రోజుకు 1GB డేటాను 25 రోజుల పాటు పొందవచ్చు.
రూ. 199తో 28 రోజుల ప్లాన్, రోజుకు 2GB డేటా :
28 రోజుల బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కన్నా చాలా చౌకగా ఉంటుంది. కేవలం రూ.199కే వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్, 28 రోజుల పాటు రోజుకు 2GB డేటాను పొందవచ్చు.
Connecting Every Indian, Empowering Every Dream!
Hon’ble PM Shri @narendramodi unveiled India’s #Swadeshi 4G Network, a milestone in self-reliance that brings world-class telecom to every corner of Bharat.#AtmanirbharBSNL #BSNLRising pic.twitter.com/cju3ki6Lee
— DoT India (@DoT_India) September 27, 2025
కొత్త కస్టమర్లకు రూ. 249 రీఛార్జ్ ప్లాన్ :
మొదటిసారి BSNL కస్టమర్లకు కంపెనీ రూ.249 ఆకర్షణీయమైన రీఛార్జ్‌ను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 45 రోజుల పూర్తి వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు.
రూ. 1499 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ పాపులర్ ప్లాన్లలో రూ. 1499 రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ 336 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయవచ్చు.336 రోజుల పాటు ప్రతిరోజూ 100 SMS పంపవచ్చు. ఈ కాలానికి మొత్తం 24GB డేటాను అందించవచ్చు.
రూ. 2399 వార్షిక ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ పూర్తి ఏడాది 365 రోజుల రీఛార్జ్ కేవలం రూ. 2,399కు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్, 2GB లిమిట్ తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది.