Apple iPhone Air Price : వారెవ్వా.. ఇది కదా డిస్కౌంట్.. ఈ ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!
Apple iPhone Air Price : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర తగ్గిందోచ్.. విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్స్ సందర్భంగా అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone Air Price (Image Credit To Original Source)
- భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,900
- విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ఐఫోన్ రూ.95,990కే లభ్యం
- అసలు ధర నుంచి నేరుగా రూ.23,910 తగ్గింపు
- బ్యాంక్ ఆఫర్లతో మరింత ఆదా చేసుకోవచ్చు
Apple iPhone Air Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ స్లిమ్ ఐఫోన్ ఎయిర్‌కు అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్. ప్రస్తుతం విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.
ఆపిల్ అల్ట్రా-స్లిమ్ ఐఫోన్ ఎయిర్‌పై రూ. 27,900 కన్నా భారీ తగ్గింపు అందిస్తోంది. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు రూ. 1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 91,990కు లభ్యమవుతోంది. ఈ డీల్ అన్ని వివరాలపై ఓసారి లుక్కేయండి.

Apple iPhone Air Price (Image Credit To Original Source)
ఐఫోన్ ఎయిర్ ధర తగ్గింపు :
భారతీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,900కు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.95,990కు లిస్ట్ అయింది. రూ.23,910 నేరుగా ధర తగ్గింపు అందిస్తోంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ వరకు పీక్ అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ ప్రోమోషన్ టెక్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ ఐఫోన్ A19 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ ఎయిర్ 48MP ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఐఫోన్‌కు ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా ఉంది. ఈ ఐఫోన్ 5.6mm మందంతో పాటు దాదాపు 165 గ్రాముల బరువు ఉంటుంది. ఆపిల్ ఐఫోన్లలో అత్యంత సన్నగా ఐఫోన్ ఇదొకటే.
