Mahindra XUV 7XO : ఈ SUV రేంజే వేరబ్బా.. మహీంద్రా XUV 7XO మాస్ ఎంట్రీ.. లుక్ చూస్తే ధర అడగరు… కొనేవరకు ఆగలేరు!
Mahindra XUV 7XO : మహీంద్రా కొత్త SUV కారు చూశారా? మహీంద్రా XUV 7XO భారత మార్కెట్లో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.66 లక్షలకు లాంచ్ అయింది. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Mahindra XUV 7XO Launch (Image Credit To Original Source)
- భారత మార్కెట్లో మహీంద్రా XUV 7XO లాంచ్
- ప్రారంభ ధర రూ. 13.66 లక్షలు
- మొదటి 40వేల మంది కస్టమర్లకు మాత్రమే
- మహీంద్రా XUV700కు అప్‌గ్రేడ్ వెర్షన్
Mahindra XUV 7XO : మహీంద్రా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. భారతీయ మార్కెట్లోకి మహీంద్రా నుంచి సరికొత్త కారు వచ్చేసింది. మహీంద్రా కొత్త SUV మోడళ్లలో XUV 7XO మోడల్ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.66 లక్షలుగా ఉంది. అయితే ధర మొదటి 40వేల మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఈ కారు బుకింగ్‌లు కూడా లాంచ్‌తో పాటు ప్రారంభమయ్యాయి. మీరు ఆన్‌లైన్‌లో లేదా మహీంద్రా షోరూమ్‌కు వెళ్లడం ద్వారా రూ. 21వేలకు బుక్ చేసుకోవచ్చు. మహీంద్రా XUV 7XO అనేది మహీంద్రా SUVలో XUV700కు అప్‌గ్రేడ్ వెర్షన్. అద్భుతమైన డిజైన్, టెక్నాలజీతో సరికొత్తగా వచ్చింది. మహీంద్రా XUV 7XO ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
క్యాబిన్‌లో 3-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ :
ఈ కారులో అతిపెద్ద హైలైట్ లోపలి భాగమే.. ఫస్ట్ టైమ్ మహీంద్రా 3-స్క్రీన్ డాష్‌బోర్డ్ తీసుకొచ్చింది. ఇందులో డ్రైవర్ కోసం ఒక స్క్రీన్ (డిజిటల్ డిస్‌ప్లే), ఇన్ఫోటైన్‌మెంట్ కోసం బిగ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఫ్రంట్ ప్రయాణీకుడి కోసం స్పెషల్ స్క్రీన్ ఉన్నాయి.

Mahindra XUV 7XO Launched (Image Credit To Original Source)
ఇటీవల లాంచ్ అయిన టాటా సియెర్రాలో కూడా క్యాబిన్‌లో ఇలాంటి ట్రిపుల్-స్క్రీన్ సెటప్ కనిపించింది. మహీంద్రా XUV 7XO క్యాబిన్‌లో కొత్త బ్రౌన్ టాన్ కలర్ థీమ్, కొత్త ఎయిర్ వెంట్స్ మెరుగైన క్వాలిటీతో సీట్లు ఉన్నాయి.
లగ్జరీ ఫీచర్లతో మహీంద్రా XUV 7XO :
మహీంద్రా XUV 7XO ఫీచర్ల పరంగా లగ్జరీ కారు కన్నా తక్కువేం కాదు. ఇందులో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఇన్-కార్ థియేటర్ మోడ్‌కు సపోర్టు ఇస్తుంది. సౌకర్యపరంగా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్యాసింజర్ సీటు కోసం బాస్ మోడ్ కూడా కలిగి ఉంది. కారుటో వెనుక సీటులో ప్రయాణీకుల కోసం ఫ్రంట్ సీటును అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
540-డిగ్రీల కెమెరాతో న్యూ లెవల్ సేఫ్టీ :
సాధారణంగా వాహనాల భద్రత కోసం 360-డిగ్రీల కెమెరా ఉంటుంది. అయితే, మహీంద్రా 540-డిగ్రీల కెమెరా సిస్టమ్ ప్రవేశపెట్టింది. చుట్టుపక్కలా వ్యూ స్పష్టంగా చూడొచ్చు. లెవల్ 2 అడాస్ (ఆటోమేటిక్ బ్రేక్ లేన్ అసిస్ట్) కూడా ఉంది.
కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ :
ఎక్స్‌టీరియర్ భాగంలో ఇప్పుడు మహీంద్రా XUV 7XO కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీగా నిలుస్తోంది. ఫ్రంట్ సైడ్ కొత్త LED లైట్స్ గ్రిల్, రెండు వైపులా కొత్త అల్లాయ్ వీల్స్ బ్యాక్ సైడ్ మొత్తం వెడల్పులో ఎల్-ఆకారపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లు ఉన్నాయి.
