Redmi Note 15 5G : కొత్త రెడ్‌మి ఫోన్ కేక.. 4K వీడియో, 108MP డ్యూయల్ AI కెమెరా అదుర్స్.. మీ బడ్జెట్‌ ధరలోనే..!

Redmi Note 15 5G : భారత మార్కెట్లో రెడ్‌మి ఇండియా కొత్త నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ చేసింది. రెడ్‌మి నోట్ సిరీస్‌లో అత్యంత తేలికైన సన్నని స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 20MP సెల్ఫీ కెమెరా ఉంది.

Redmi Note 15 5G : కొత్త రెడ్‌మి ఫోన్ కేక.. 4K వీడియో, 108MP డ్యూయల్ AI కెమెరా అదుర్స్.. మీ బడ్జెట్‌ ధరలోనే..!

Redmi Note 15 5G (Image Credit To Original Source)

Updated On : January 6, 2026 / 4:11 PM IST
  • ఏఐ కెమెరాలతో రెడ్‌మి నోట్ 15 5జీ లాంచ్
  • 108MP శాంసంగ్ సెన్సార్, కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, భారీ బ్యాటరీ
  • IP66-రేటెడ్ స్లిమ్ డిజైన్‌తో రూ.22,999 నుంచి ప్రారంభం
  • ఆండ్రాయిడ్ 15-ఆధారిత HyperOS 2తో రన్ అవుతుంది

Redmi Note 15 5G Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మి ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 15 5Gని లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, స్లిమ్ బాడీని కలిగి ఉంది. ఈ ఫోన్ కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 5520mAh బ్యాటరీతో వస్తుంది.

5 ఏళ్ల తర్వాత కూడా ఈ బ్యాటరీ లైఫ్ 80శాతం వరకు ఉంటుంది. 108MP డ్యూయల్ ఏఐ కెమెరాను కలిగి ఉంది. ఈ సెన్సార్ షావోమీ కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసింది. ఈ ఫోన్‌లో 20MPసెల్ఫీ కెమెరా కూడా ఉంది. అయితే, రెడ్‌మి నోట్ 15 ముఖ్య ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు చూద్దాం..

భారత్‌లో రెడ్‌మి నోట్ 15 5G ధర, లభ్యత :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999కు పొందవచ్చు. ఈ ధరలలో బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ జనవరి 9 నుంచి అమ్మకానికి వస్తుంది.

రెడ్‌మి నోట్ 15 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

రెడ్‌మి నోట్ 15 5G ఫోన్ అనేది కంపెనీ ఇప్పటివరకు అందించిన ఫోన్లలో అత్యంత సన్నని తేలికైన స్మార్ట్‌ఫోన్ ఇదే. 7.35mm సన్నగా 178 గ్రాముల బరువు ఉంటుంది. రెడ్‌మి నోట్ 15 5G 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.

Redmi Note 15 5G

Redmi Note 15 5G (Image Credit To Original Source)

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే టీయూవీ ట్రిపుల్ సర్టిఫైడ్ ఉండటం వల్ల కంటిపై తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. తడి వేళ్లతో కూడా ఈ డిస్‌ప్లే టచ్ చేసినా పనిచేస్తుంది.

Read Also : LG W6 Wallpaper TV : ఈ LG వాల్‌పేపర్ టీవీ చూశారా? గోడకు భలే సెట్ అయిందిగా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ట్రూ వైర్‌లెస్ కనెక్టవిటీ..!

రెడ్‌మి నోట్ 15 5G ప్రాసెసర్, OS :
రెడ్‌మి నోట్ 15 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా షావోమీ హైపర్ 2 OSపై రన్ అవుతుంది. కంపెనీ 4 OS అప్‌గ్రేడ్‌లు 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో Dolby ఆట్మోస్ సౌండ్ సపోర్ట్, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. గూగుల్ జెమిని ఏఐ కూడా కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 15 5G బ్యాటరీ, కెమెరా :
రెడ్‌మి నోట్ 15 5Gలో 5520mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5 ఏళ్ల తర్వాత కూడా ఫోన్ బ్యాటరీ హెల్త్ స్టేటస్ 80శాతం వద్ద ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ రెడ్‌మి ఫోన్‌లో 108MP శాంసంగ్ ISOCELL HM9 కెమెరా సెన్సార్ ఉంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K వీడియో సపోర్ట్‌తో వస్తుంది. 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ 108MP సెన్సార్ ఇతర బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉండదని కంపెనీ పేర్కొంది. ఎందుకంటే.. షావోమీ, రెడ్‌మి ఫోన్ల కోసమే తయారు చేసింది. హైక్వాలిటీ ఫొటోలను తీయొచ్చు.