LG W6 Wallpaper TV : ఈ LG వాల్‌పేపర్ టీవీ చూశారా? గోడకు భలే సెట్ అయిందిగా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ట్రూ వైర్‌లెస్ కనెక్టవిటీ..!
LG W6 Wallpaper TV : అత్యత సన్నని ఎల్‌జీ వైర్‌లెస్ టీవీ వచ్చేసింది. గోడకు వాల్ పేపర్ మాదిరిగా కలిసిపోయింది. ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. సైజు, ధర వివరాలివే..
LG W6 Wallpaper TV (Image Credit To Original Source)
- CES 2026లో ఎల్‌జీ వైర్‌లెస్ టీవీ ఆవిష్కరణ
- ఈ వాల్ పేపర్ టీవీ రెండు సైజుల్లో అందుబాటులోకి
- వైర్‌లెస్ OLED evo W6 వాల్‌పేపర్ టీవీని నేరుగా గోడకు పెట్టుకోవచ్చు
- జీరో కనెక్ట్ బాక్స్, టీవీ నుంచి 10 మీటర్ల దూరంలో ఉంచవచ్చు.
LG W6 Wallpaper TV : కొత్త టీవీ కొనేవారికి గుడ్ న్యూస్.. సరికొత్త టెక్నాలజీతో వైర్‌లెస్ టీవీ వచ్చేసింది. చూసేందుకు అచ్చంగా వాల్ పేపర్ మాదిరిగా గోడకు అమర్చి ఉంటుంది. ఈ కొత్త వాల్ పేపర్ టీవీని CES 2026లో ఎల్‌జీ ఆవిష్కరించింది. అదే.. OLED evo W6 వాల్ పేపర్ టీవీ.. చాలా సన్నగా ఉంటుంది. కంపెనీ ‘వాల్‌పేపర్ టీవీగా చెబుతోంది.
2017లో మొదటగా వాల్‌పేపర్ టీవీ కాన్సెప్ట్ తీసుకురావాలని భావించింది. వాస్తవానికి W6 వాల్‌పేపర్ టీవీ కేవలం 9mm మందం మాత్రమే ఉంటుంది. ఈ టీవీ దాదాపు స్మార్ట్‌ఫోన్ లాగా సన్నగా ఉంటుంది. ఈ కొత్త టీవీకి ‘ట్రూ వైర్‌లెస్’ కనెక్టివిటీ ఉంటుంది. కొత్త ఇంటర్నల్ డిజైన్ కూడా ఉంది. అందుకే ఇది గోడపై సరిగ్గా సెట్ అవుతుంది.
అత్యంత సన్నని వైర్‌లెస్ టీవీ :
ఎల్‌జీ W6 టీవీ అనేది అత్యంత సన్నని వైర్‌లెస్ OLED టీవీ. ఎల్‌జీ వాల్ మౌంట్‌ను కూడా అప్‌డేట్ చేసింది. తద్వారా పూర్తిగా గోడకు స్టిక్ అయి ఉంటుంది. గోడపై అమర్చిన తర్వాత చూసేందుకు అచ్చం ‘వాల్‌పేపర్’ మాదిరిగా కనిపిస్తుంది. అంటే.. టీవీ వైర్‌లెస్‌గా పనిచేస్తుంది. ‘జీరో కనెక్ట్ బాక్స్’ అనే స్పెషల్ బాక్స్ కూడా టీవీతో వస్తుంది.
ఇందులో అన్ని ఇన్‌పుట్‌లు (కనెక్షన్ పోర్ట్‌లు) ఉంటాయి. టీవీ నుంచి 10 మీటర్ల దూరంలో ఉంచవచ్చు. తద్వారా టీవీ బ్యాక్ పవర్ కార్డ్ మాత్రమే కనిపిస్తుంది. టీవీ ఏ గదిలోనైనా ఈజీగా సెట్ అయ్యేలా డిజైన్ చేశారు.
ఈ ఎల్‌జీ టీవీ సైజు ఎంతంటే? :
చూసేందుకు ఎల్‌జీ టీవీ సన్నగా ఉన్నప్పటికీ క్వాలిటీలో ఎలాంటి తేడా ఉండదు. ఈ వాల్‌పేపర్ టీవీ క్వాలిటీ కోల్పోకుండా 4K వీడియో, ఆడియోను అందిస్తుంది. ఈ 4K OLED ప్యానెల్ 77-అంగుళాల 83-అంగుళాల సైజుల్లో లభిస్తుంది. ఈ టీవీ అద్భుతమైన పర్ఫార్మెన్స్, క్లియర్ క్వాలిటీ డిస్‌ప్లే కోరుకునే యూజర్లను ఆకట్టుకునేలా ఉంటుంది.
లైటింగ్ పడినా టీవీ స్క్రీన్ క్లారిటీ తగ్గదు :
ఓఎల్ఈడీ evo W6 ఎల్ జీ ‘హైపర్ రేడియంట్ కలర్ టెక్నాలజీ’తో వస్తుంది. బ్లాక్ డెప్త్, కలర్ క్లారిటీ బ్రైట్‌నెస్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే స్క్రీన్‌పై గ్లేర్‌ను కూడా తగ్గిస్తుంది. ఎల్ జీ ప్రకారం.. బ్రైట్‌నెస్ బూస్టర్ అల్ట్రా సిస్టమ్ ద్వారా ఈ టీవీ పాత ఓఎల్ఈడీ టీవీల కన్నా 3.9 రెట్లు బ్రైట్‌నెస్ అందిస్తుంది.

LG W6 Wallpaper TV (Image Credit To Original Source)
ఇప్పటివరకు ఎల్‌జీ ఓఎల్ఈడీ టీవీలో ఈ మోడల్ ఇతర ఎల్‌జీ టీవీల కన్నా లో రిప్లెక్షన్ ఉందని కంపెనీ పేర్కొంది. బాగా లైటింగ్ ఉన్న గదుల్లో కూడా టీవీ స్క్రీన్ పిక్చర్ క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తుంది.
ఎల్‌జీ వాల్‌పేపర్ టీవీ స్పెసిఫికేషన్లు :
ఈ ఎల్‌జీ టీవీ (ఆల్ఫా) 11 ఏఐ ప్రాసెసర్ Gen3తో వస్తుంది. ఈ ప్రాసెసర్ సౌండ్ తగ్గించేందుకు ‘డ్యూయల్ ఏఐ ఇంజిన్’తో రన్ అవుతుంది. దాంతో ఫొటోలు పూర్తిగా చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. W6 గేమింగ్‌కు కూడా చాలా బాగుంది. 4K 165Hz రిఫ్రెష్ రేట్, NVIDIA G-SYNC సపోర్టు, AMD FreeSync, ప్రీమియం 0.1ms రెస్పాన్స్ టైమ్ అందిస్తంది. గేమర్‌లకు ఈ టీవీ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఎల్‌జీ వాల్‌పేపర్ టీవీ లాంచ్ ధర :
ఎల్‌జీ ఓఎల్ఈడీ evo W6 లాస్ వెగాస్‌లో జరిగిన CES 2026లో ఆవిష్కరించింది. అయితే, ఈ అల్ట్రా-స్లిమ్ టీవీ లాంచ్ ధర గురించి ఎల్‌జీ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
