Reliance Jio : జియో అదిరిపోయే ప్లాన్.. జస్ట్ రూ. 349 ప్లాన్‌తో ఫ్రీ జియోహోమ్.. కొత్త కనెక్షన్ బెనిఫిట్స్ ఇవే!
Reliance Jio : జియో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా జియోహోమ్ ట్రయల్ కూడా ఫీగా అందిస్తోంది. మరెన్నో బెనిఫిట్స్ కూడా..

Reliance Jio FreeHome
Reliance Jio : రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. జియో కొత్త ఆఫర్లు, మరెన్నో ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తూనే ఉంది. జియో ట్రూ 5G ప్లాన్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ (Reliance Jio) ప్లాన్‌లు లేదా గేమింగ్ డెడికేటెడ్ ప్లాన్‌లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. టెలికాం దిగ్గజం ఇప్పుడు సాధారణ రూ. 349 ప్లాన్ ద్వారా మల్టీ బెనిఫిట్స్ అందిస్తోంది. ఇంతకీ ఈ ప్లాన్‌తో ఏయే బెనిఫిట్స్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జియో రూ. 349 ప్లాన్ బెనిఫిట్స్ :
రిలయన్స్ జియో రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB 4G డేటా, అన్‌లిమిటెడ్ (Reliance Jio) వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, ట్రూ 5Gకి అన్‌లిమిటెడ్ యాక్సెస్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌తో పాటు అందిస్తుంది. ఇప్పుడు, జియో 9వ వార్షికోత్సవ వేడుకల కింద ఈ ప్లాన్ అనేక ఆఫర్‌లతో వస్తుంది.
జియో ఫైనాన్స్ : జియో గోల్డ్‌పై 2శాతం, క్లెయిమ్ కోసం +91-8010000524కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
- జియోహోమ్ కొత్త కనెక్షన్‌పై 2 నెలల ఫ్రీ ట్రయల్ పొందొచ్చు.
- జియోహాట్‌స్టార్ : మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ 3 నెలలు
- రిలయన్స్ డిజిటల్ : ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై రూ. 399 తగ్గింపు
- అజియో : కనీస ఆర్డర్ వాల్యూ రూ. 1000పై ఫ్లాట్ రూ. 200 తగ్గింపు
- జొమాటో : 3 నెలల జొమాటో గోల్డ్ సబ్‌స్క్రిప్షన్
- జియోసావన్ : నెల జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్
- నెట్‌మెడ్స్ : 6 నెలల Netmeds ఫస్ట్ టైమ్ సబ్‌స్క్రిప్షన్
- ఈజీమై ట్రిప్ : దేశీయ విమానాలపై రూ. 2.220 తగ్గింపు, హోటళ్లపై 15 శాతం తగ్గింపు
- జియోఏఐక్లౌడ్ : ఫ్రీ 50GB స్టోరేజీ
అంతేకాకుండా, జియో రూ.3599 ప్లాన్, రూ.999 ప్లాన్, రూ.899 ప్లాన్‌లతో అదే 9వ వార్షికోత్సవ ప్రయోజనాలను అందిస్తోంది. అది పక్కన పెడితే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్ కోసం చూస్తున్న వారందరూ 30 రోజుల వ్యాలిడిటీతో రూ.100 ప్లాన్ ఎంచుకోవచ్చు. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB హై స్పీడ్ డేటాను అందిస్తుంది.
మీరు ఎంటర్‌టైన్మెంట్ కోసం చూస్తుంటే జియో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, ఫ్యాన్‌కోడ్, జీ5, సోనీలైవ్ వంటి పాపులర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు కూడా కలిగి ఉంది. ఈ ప్లాన్లలో 5G డేటా, హై స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, జియోఏఐక్లౌడ్ యాక్సెస్ వంటి మరెన్నో బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.