bsnl
BSNL : టెలికాం రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పలు రకాల ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. భారత టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ..బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్).. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగడంతో విపరీతమైన పోటీ పెరిగింది. దీంతో బీఎస్ఎన్ఎల్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. అయితే…తనకున్న కస్టమర్లు చేజారిపోకుండా ఉండేందుకు..కొత్త వారిని అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తోంది. తాజాగా..అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చింది.
రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.
రూ. 299 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ : ఆరు నెలలు ఉండనుంది. 100జీబీ డేటా 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్ ఉంటుంది. డేటా పూర్తయితే…ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కు తగ్గుతుంది.
రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ : 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో 200జీబీ డేటా అందుతుంది. డేటా పరిమితి పూర్తయిన తర్వాత..ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.
రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ : 10 ఎంబిపిఎస్ వేగంతో 500జీబీ డేటా వస్తుంది. ఈ డేటా పూర్తయతే..ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.
కొత్త వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్ రూ.299, రూ.399 ప్లాన్‌లు తీసుకోవాలంటే రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.