×
Ad

BSNL Annual Plans : BSNL యూజర్లకు పండగే.. ఈ 2 వార్షిక రీఛార్జ్ ప్లాన్లు అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజులు ఎంజాయ్!

BSNL Annual Plans : బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వ్యాలిడిటీతో రెండు అదిరిపోయే వార్షిక రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లతో ఏడాది మొత్తం రీఛార్జ్ లేకుండా కాల్స్, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

BSNL Annual Plans

  • బీఎస్ఎన్ఎల్ రూ.2,626, రూ.2,799 రెండు వార్షిక ప్లాన్లు
  • అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, 3GB వరకు డెయిలీ డేటా
  • BSNL యాప్, వెబ్‌సైట్, ఇతర స్టోర్ల ద్వారా రీఛార్జ్ ఆప్షన్, 365 రోజుల వ్యాలిడిటీ,

BSNL Annual Plans : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ రెండు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్లు 365 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏడాది మొత్తం ఎంజాయ్ చేయొచ్చు.

రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజువారీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ రెండు ప్లాన్‌లలో బ్రౌజింగ్, వీడియోలు పొందవచ్చు. రోజువారీ డేటా అవసరమయ్యే యూజర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు. ధర, వ్యాలిడిటీ పరంగా అద్భుతంగా ఉంటాయి. ప్రతి బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉండనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ రూ.2,626 వార్షిక ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ రూ.2,626 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు ప్రతిరోజూ 2.6GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. వెబ్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్, ఆన్‌లైన్ చాటింగ్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ తర్వాత కంపెనీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.

Read Also : Xiaomi 14 Civi : ఇది కదా డిస్కౌంట్.. భారీగా తగ్గిన షావోమీ 14 Civi ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఈ ప్లాన్ డేటా బెనిఫిట్స్ కోసం దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. యూజర్లు లోకల్ లేదా నేషనల్ కాల్ అయినా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అదనంగా, బీఎస్ఎన్ఎల్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ రూ. 2,799 వార్షిక ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
రూ.2,799 ధరతో బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ యూజర్లకు రోజువారీ డేటా కోటాను 3GB అందిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.

డేటా బెనిఫిట్స్ కోసం ఈ ప్లాన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు.

బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్లు ఇవే :
బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 2626 ప్లాన్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ఫిబ్రవరి 24 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, రూ.2,799 ప్లాన్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. బీఎస్ఎన్ఎల్ అధికారిక ఛానెల్స్ ద్వారా ఈ ప్లాన్‌ ఈజీగా పొందవచ్చు. యూజర్లు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా ఇతర రీఛార్జ్ ప్లాట్‌ఫామ్‌లపై రీఛార్జ్ చేసుకోవచ్చు.