BSN Recharge Plans : కస్టమర్లకు గుడ్ న్యూస్.. BSNL 3 లాంగ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 45 రోజుల వ్యాలిడిటీ.. కేవలం రూ. 249 మాత్రమే..!

BSN Recharge Plans : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ పవర్‌ఫుల్ రీఛార్జ్ ప్లాన్‌లను ఎలా పొందాలంటే?

BSNL

BSN Recharge Plans : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రాబోయే రోజుల్లో 5G సర్వీసులను ప్రారంభించనుంది. ఇటీవలే BSNL అధికారిక అకౌంట్లలో 3 స్పెషల్ ప్లాన్‌ల రివీల్ చేసింది. లాంగ్ వ్యాలిడిటీ (BSN Recharge Plans) అన్‌‌లిమిటెడ్ కాలింగ్, ఫుల్ డేటాను పొందవచ్చు.

BSNL ధర రూ.897 ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీ :
ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు ఉంటుంది. సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారులు 6 నెలల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా బీఎస్ఎన్ఎల్ సర్వీసును పొందవచ్చు. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, మొత్తం 90GB డేటాను అందిస్తుంది. పదే పదే రీఛార్జ్ చేయకుండా ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు.

Read Also : Vivo T4R Launch : వివో లవర్స్ గెట్ రెడీ.. వివో నుంచి కొత్త T4R 5G ఫోన్ వస్తోంది.. ఈ వారంలోనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

BSNL రూ. 599 ఆల్ రౌండర్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ కోసం ఆల్-రౌండర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దాదాపు 3 నెలలు ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిరోజూ 3GB డేటా చొప్పున మొత్తం 252GB వరకు పొందవచ్చు. అన్‌‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

BSNL రూ. 249 సరసమైన ప్లాన్ :
తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం చూస్తుంటే BSNL రూ.249 ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటాతో మొత్తం 90GB, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అలాగే బీఎస్ఎన్ఎల్ BiTV OTT యాప్‌కు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు. ఇందులో 400 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్ వీక్షించవచ్చు.