Vivo T4R Launch : వివో లవర్స్ గెట్ రెడీ.. వివో నుంచి కొత్త T4R 5G ఫోన్ వస్తోంది.. ఈ వారంలోనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo T4R Launch : వివో లవర్స్ కోసం కొత్త T4R ఫోన్ వచ్చేస్తోంది. ఈ అద్భుతమైన ఫోన్ వచ్చే వారమే లాంచ్ కాబోతుంది. పూర్తి వివరాలివే..

Vivo T4R Launch
Vivo T4R Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి T4R ఫోన్ రాబోతుంది. వివో T-సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరించేందుకు రెడీగా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ (Vivo T4R Launch) జూలై 31న ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కంపెనీ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ కొన్ని ముఖ్య స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది.
ఈ వివో ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. భారత మార్కెట్లో అత్యంత సన్నని క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో రానుంది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఫోన్లలో వివో T4, వివో T4x, వివో T4 అల్ట్రా, వివో T4 లైట్‌లతో కూడిన వివో T4 సిరీస్‌లో చేరనుంది. రాబోయే వివో T4R ఫోన్ ఫీచర్లు, ధర, కెమెరా, డిస్‌ప్లేకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
వివో T4R ధర ఎంతంటే? :
వివో T4R ఫోన్ ధర రూ.20వేల లోపు ఉంటుందని అంచనా. కచ్చితమైన ధర ఇంకా వెల్లడి కానప్పటికీ, బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.19,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వివో T4R డిజైన్, కలర్ ఆప్షన్లు :
వివో T4R ఫోన్ వైట్, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వివో ఫోన్ పిల్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండొచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, బ్యాక్ ప్యానెల్‌లో ఆరా లైట్ రింగ్‌ను కలిగి ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
వివో T4R స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. వివో T4R ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), బ్యాక్ 2MP బోకె కెమెరా ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఈ వివో ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
అదనంగా, ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయని చెబుతున్నారు. IP68, IP69 రేటెడ్ రెసిస్టెన్స్‌తో కూడా వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత కస్టమ్ యూఐలో బాక్స్ వెలుపల రన్ అయ్యే అవకాశం ఉంది. లీక్ డేటాలో 12GB ర్యామ్ కూడా ఉంది.