BSNL Flash Sale
BSNL All Rounder Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం కొత్త రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. అదే.. ఆల్ రౌండర్ ప్లాన్.. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 84 రోజుల పాటు 252GB డేటాను ప్రతిరోజు 3GB డేటా చొప్పున పొందవచ్చు.
రిలయన్స్ జియో లేదా ఎయిర్‌టెల్‌కు వెళ్లకుండా ఉండేందుకు బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే BSNL ఈ అద్భుతమైన ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందవచ్చు. లాంగ్ వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటాను కూడా పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందించే రూ.599 ప్లాన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL రూ.599 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ అందించే రూ. 599 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 3GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 252GB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS కూడా పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఆల్ రౌండర్ ప్లాన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ కోసం BSNL అధికారిక సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేయాలి. మీరు ఈ చౌకైన ప్లాన్ ఎంచుకోవచ్చు.
BSNL రూ.249 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ ఎక్స్ అకౌంటులో ఈ సరసమైన అన్‌లిమిటెడ్ ప్లాన్ గురించి వివరణ ఇచ్చింది. ఈ ప్లాన్‌లో కేవలం రూ.249కి 45 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. సరసమైన ప్లాన్ అని చెప్పొచ్చు. దీర్ఘకాలిక వ్యాలిడిటీని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. రూ.249 ప్లాన్‌లో మొత్తం 90GB డేటాను పొందవచ్చు.
ప్రతి ప్లాన్ మాదిరిగానే ప్రతిరోజూ 100 SMS పొందవచ్చు. ఇంటర్నెట్, కాలింగ్‌తో పాటు రూ.249 ప్లాన్‌లో BSNL BiTV OTT యాప్‌కు కూడా యాక్సెస్ పొందవచ్చు. 400 లైవ్ టీవీ ఛానెల్స్ కూడా యాక్సెస్ చేస్తుంది. రూ.249 ప్లాన్‌లో ప్రతిరోజూ హై స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాల్స్, OTT బెనిఫిట్స్ పొందవచ్చు.