BSNL BiTV Premium Pack
BSNL BiTV Premium Pack : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 151 ధరకే BiTV ప్రీమియం ప్యాక్ ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ కొనుగోలుపై సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌లో 25 కన్నా ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లు, 450 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయొచ్చు.
BiTV యాప్ ఏంటి?
2025 ఫిబ్రవరిలో బీఎస్ఎన్ఎల్ BiTV యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రారంభ యూజర్లకు ట్రైయల్ (BSNL BiTV Premium Pack) సమయంలో ఉచితంగా యాక్సెస్ అందిస్తోంది. ఈ యాప్ వినియోగదారులు ఒకే ప్లాట్‌ఫామ్‌లో OTT, లైవ్ టీవీ ఛానెల్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. వివిధ OTT యాప్‌లకు సబ్‌స్క్రైబ్ చేసుకునే బదులు వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ BiTV ప్యాక్ ద్వారా కంటెంట్ మొత్తం యాక్సస్ చేయొచ్చు.
ఏ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయంటే? :
BiTV ప్రీమియం ప్యాక్‌లో Aha, ZEE5, SonyLIV, Shemaroo, Sun NXT, Chaupal, Lionsgate Play, ETV Win, Discovery, Epic ON వంటి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. దాంతో పాటు, వినియోగదారులు 450 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ పొందవచ్చు.
అయితే, ఈ ప్యాక్ వ్యాలిడిటీకి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. సరసమైన ఎంటర్ టైన్మెంట్ ప్యాక్ కూడా ప్రీమియం ప్యాక్ కాకుండా బీఎస్ఎన్ఎల్ మరో రెండు చౌకైన ప్యాక్‌లను కూడా అందిస్తోంది. రూ. 28కే 30 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది.
వినియోగదారులు లయన్స్‌గేట్ ప్లే, ETV విన్, VROTT, ప్రీమియంఫ్లిక్స్, నమ్మ్‌ఫ్లిక్స్, గుజారి, ఫ్రైడే వంటి 7 ఓటీటీ ప్లాట్‌ఫారమ్ యాక్సెస్ పొందుతారు. దాంతో పాటు, 9 ఫ్రీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పొందవచ్చు. రూ. 29 ప్యాక్ ద్వారా ShemarooMe, Lionsgate Play, Dangal Play, VROTT యాక్సెస్ అందిస్తుంది.
ఎందుకు ప్రత్యేకమంటే? :
అన్ని OTT ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను యాక్సస్ కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ అందిస్తోంది. రూ. 151 ధరకు సరసమైన ఎంటర్‌టైన్మెంట్ ప్యాక్ అందిస్తోంది.