Samsung Galaxy Z Fold 6 5G : ఖతర్నాక్ ఆఫర్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy Z Fold 6 5G : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 5G ఫోన్ ధర తగ్గింది.. ఈ మడతబెట్టే ఫోన్ అమెజాన్‌లో రూ. 28వేలు తగ్గింపు పొందవచ్చు.

Samsung Galaxy Z Fold 6 5G
Samsung Galaxy Z Fold 6 5G : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పండుగ సీజన్‌కు ముందే లాస్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 5జీ ఫోన్ భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ కార్డు ఆఫర్లు లేకుండా బుక్-స్టైల్ ఫోల్డబుల్‌పై రూ.24వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. తద్వారా శాంసంగ్ ఫోన్ రూ.1,64,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.
సాధారణంగా శాంసంగ్ స్టోర్‌లో ఈ ఫోల్డబుల్ (Samsung Galaxy Z Fold 6 5G) ఫోన్ దాదాపు రూ.1,49,999 ధరకు లభిస్తుంది. డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, ట్రిపుల్ కెమెరా సెటప్, బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌పై ఈ శాంసంగ్ ఫోన్ రూ. 1,20,000 లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 5జీ ఫోన్ ధర ఎంత తగ్గిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 5G ధర :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర రూ.1,24,999కి పొందవచ్చు. అంటే.. ధర రూ. 25వేల కన్నా తగ్గింపు ధరకు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
తద్వారా ధర రూ.1,20,000 కన్నా తగ్గింపు ధరకే పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు. నెలకు ఈఎంఐ 6,060 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మీ బ్యాంక్ పాలసీలను బట్టి ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వర్తిస్తాయి.
మీ పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకుంటే.. రూ. 42,350 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి రేటు మారుతుంది. అమెజాన్ హోం అప్లియన్సెస్, టెలివిజన్లు సహా వైడ్ రేంజ్ ప్రొడక్టులపై మెరుగైన డీల్స్ అందిస్తోంది. మర్చంట్ కొనుగోళ్లపై 28శాతం వరకు ఆదా చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ ప్యానెల్, 7.6-అంగుళాల లోపలి మెయిన్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. 4400mAh బ్యాటరీ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 10MP, 4MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.