BSNL SIM Order : BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్ .. ఇక ఆన్‌లైన్‌లోనే కొత్త SIM కార్డు ఆర్డర్ చేయొచ్చు.. నేరుగా ఇంటికే డెలివరీ..!

BSNL SIM Order : ఏవైనా సమస్యలు ఉంటే వినియోగదారులు 1800-180-1503 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చని BSNL పేర్కొంది.

BSNL SIM Order

BSNL SIM Order : BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో కొత్త సర్వీసును అందుబాటులోకి (BSNL SIM Order) తీసుకొచ్చింది. ఇప్పటికే అనేక ఆఫర్లు, ఇతర సేవలను అందిస్తోంది. లేటెస్ట్‌గా BSNL సిమ్ కార్డును వినియోగదారులు ఆర్డర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది.

ఈ సర్వీసు ద్వారా నేరుగా ఇళ్లకు BSNL SIM హోం డెలివరీ అవుతుంది. ఇటీవలే హైదరాబాద్‌లో 5G సర్వీసులను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిమ్ డెలివరీని మరింత ఈజీగా మార్చేందుకు కంపెనీ కొత్త వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో కస్టమర్లు తమ ఇళ్ల నుంచి సిమ్ కార్డును సులభంగా ఆర్డర్ పెట్టవచ్చు. బయటకు వెళ్లకుండా BSNL సిమ్‌ను ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సెల్ఫ్ KYC సౌకర్యం :
బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు వెబ్‌సైట్‌లో నేరుగా KYC ప్రక్రియను పూర్తి చేసే సౌలభ్యాన్ని అందిస్తోంది. సిమ్ కార్డు ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు (https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/) లింక్‌ను విజిట్ చేయాలి. ఆపై KYC ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

Read Also : EPFO : ఈపీఎఫ్ఓ సభ్యులకు బిగ్ రిలీఫ్.. PF ఆటో క్లెయిమ్ లిమిట్ రూ. 5 లక్షలకు పెంపు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఈ సర్వీసు కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లు రెండింటికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు పిన్ కోడ్, పేరు, అల్ట్రానేట్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. కుటుంబ సభ్యునికి లేదా ఎవరికి కొత్త సిమ్ కావాలో ఆప్షన్ ఎంచుకోవచ్చు.

హెల్ప్‌లైన్ నంబర్ ఇదే :
సమాచారం అందించిన తర్వాత వినియోగదారులు అల్ట్రానేట్ మొబైల్ నంబర్‌కు OTP అందుకుంటారు. ఈ ప్రక్రియలో ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే.. BSNL యూజర్లు తమ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-1503 ద్వారా సంప్రదించవచ్చు. భారత అంతటా 4G, 5G నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

జూన్ 2025 చివరి నాటికి లక్ష 4G సైట్‌లను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో మొబైల్ వినియోగదారుల నగరాలకు 5G సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇటీవలే ఎంపిక చేసిన నగరాల్లో Q-5G FWA సర్వీసులను ప్రవేశపెట్టింది.

అతి త్వరలో మరిన్ని ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురానుంది. 100Mbps స్పీడ్‌తో నెలకు ధర రూ. 999 నుంచి ఉంటుంది. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే.. BSNL సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.