BSNL Rs 99 plan challenge
BSNL New Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్‌తో మరోసారి టెలికం రంగంలో తరంగాలను సృష్టించింది.
ఇప్పటికే అధిక రీఛార్జ్ ఖర్చులను ఎదుర్కొంటున్న మొబైల్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ అందిస్తోంది.. సరసమైన రీఛార్జ్ ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలపై తీవ్రఒత్తిడి తెస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇతర ప్రైవేట్ టెలికం దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాకు మాస్టర్ స్ట్రోక్ అనమాట..
ఎందుకంటే.. బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్ ప్లాన్ కేవలం రూ. 99 ధరకే అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తాజా నిర్ణయంతో ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య తీవ్రపోటీని పెంచింది.
ట్రాయ్ ఆదేశాలను అనుసరించి ఈ టెలికం కంపెనీలు మరింత సరసమైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయినప్పటికీ, బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లలో అన్నింటికన్నా ముందుంది. ఇతర సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికీ వాయిస్ సర్వీసులకు భారీ ఛార్జీలు విధిస్తున్నప్పటికీ, బీఎస్ఎన్ఎల్ రూ.99 ప్లాన్ బిగ్ డీల్ అని చెప్పవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 99 రీచార్జ్ ప్లాన్ :
ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ నుంచి ప్రయోజనం పొందడమే కాకుండా 17 రోజుల వ్యాలిడిటీ వ్యవధిని కూడా పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌తో డేటా లేదా ఎస్ఎంఎస్ సేవలను అందించదు.
Talk as much as you want for just ₹99!
17 days of non-stop conversations, zero interruptions, endless fun. Why pay more when you can chat freely for less?
Your phone, your rules. Let’s talk! #BSNLIndia #UnlimitedTalk #NoLimits #TalkTillYouDrop #SwitchToBSNL pic.twitter.com/NcoQuHsbPJ
— BSNL India (@BSNLCorporate) January 30, 2025
మీకు డేటా లేదా ఎస్ఎంఎస్ అవసరం లేకపోతే, ఈ రీఛార్జ్ ఆప్షన్ మీకు బెస్ట్ అని చెప్పవచ్చు. బీఎస్ఎన్ఎల్ సెకండరీ సిమ్‌గా ఉపయోగించాలనుకునే లేదా అధిక ఖర్చులు లేకుండా తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఇది అద్భుతంగా సరిపోతుంది.
90 రోజుల వ్యాలిడిటీతో :
ట్రాయ్ ఇటీవలి మార్గదర్శకాలను అనుసరించి బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. డేటా లేకుండా సరసమైన ప్లాన్‌లను ప్రవేశపెట్టేందుకు టెలికాం ప్రొవైడర్లను ట్రాయ్ ప్రోత్సహిస్తుంది. రూ. 99 ఆఫర్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ రూ. 439 ధరతో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఆ వ్యవధిలో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ అనుమతిస్తుంది. ఇది బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను బడ్జెట్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
BiTV సర్వీసు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ :
మరోవైపు.. బీఎస్ఎన్ఎల్ డైరెక్ట్-టు-మొబైల్ టీవీ సర్వీస్ (BiTV)ని ప్రారంభించింది. వినియోగదారులు తమ మొబైల్ డివైజ్‌లలో ఎలాంటి ఖర్చు లేకుండా 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది.
గత నెలలో పుదుచ్చేరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తర్వాత ఈ సర్వీసు భారత్ అంతటా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ అగ్రిగేటర్ ఓటీటీ ప్లే భాగస్వామ్యంతో (BiTV) వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలో నేరుగా ప్రముఖ ఓటీటీ కంటెంట్ యాక్సెస్‌ను అందిస్తుంది.