BSNL Q 5G Plan : BSNL కొత్త Q-5G సర్వీసు.. సిమ్ లేకుండానే హై స్పీడ్ ఇంటర్నెట్.. కేవలం రూ. 999 నుంచే ప్లాన్..!

BSNL Q 5G Plan : బీఎస్ఎన్ఎల్ Q-5G FWA ప్లాన్ నెలకు రూ. 999 నుంచి ప్రారంభమవుతుంది. 100Mbps వరకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది.

BSNL Q 5G Plan

BSNL Q 5G Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ BSNL క్వాంటమ్ 5G సర్వీసును హైదరాబాద్‌లో (BSNL Q 5G Plan) అధికారికంగా ప్రారంభించింది.

ఈ ఇంటర్నెట్ సర్వీసును Q-5G పేరుతో ప్రవేశపెట్టింది. ఈ క్వాంటమ్ 5G ఇంటర్నెట్ సర్వీసు స్వదేశీ టెక్నాలజీతో వచ్చింది.

Read Also : Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో కిర్రాక్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ధర జస్ట్ రూ. 11వేలు మాత్రమే.. డోంట్ మిస్..!

అతి త్వరలో హైదరాబాద్‌తో పాటు, బెంగళూరు, విశాఖపట్నం, పూణే, చండీగఢ్, గ్వాలియర్‌లలో BSNL Q-5Gని త్వరలో ప్రారంభించాలని యోచిస్తోంది. క్వాంటమ్ 5G సర్వీసు ప్లాన్ ధర రూ. 999 నుంచి ప్రారంభమవుతుంది.

వినియోగదారులు 100Mbps సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ పొందుతారని కంపెనీ తెలిపింది. 300Mbps స్పీడ్ ఇంటర్నెట్‌ కోసం రూ. 1,499 ప్లాన్ కూడా అందిస్తోంది.

నో సిమ్.. నో వైరింగ్ :
BSNL 5G సర్వీసు కోసం వినియోగదారులు సిమ్ కార్డ్ కొనాల్సిన పనిలేదు. వైరింగ్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం CPE అనే డివైజ్ ద్వారా స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ పొందవచ్చు.

Q-5G FWA ప్లాన్ అంటే ఏంటి? :
నివేదిక ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G సర్వీసును ప్రత్యేకించి టైర్-2, టైర్-3 నగరాల కోసం రూపొందించింది. ఆప్టికల్ ఫైబర్ పరిమితంగా వాడుతారు. ఈ ప్రాంతాల్లోని వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది.

BSNL Q-5G నెట్‌వర్క్ సర్వీసు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ అయింది. భారత్‌లో తయారైన డివైజ్‌ల ద్వారా వినియోగదారులు స్పీడ్ కనెక్టివిటీ పొందవచ్చు. 5G సర్వీసును ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) ద్వారా అందిస్తుంది.

Q-5G నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందంటే? :
BSNL Q-5G సర్వీసులో వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ లేవు. హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా మాత్రమే పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ మాదిరిగానే వినియోగదారులు సిమ్ కార్డ్ లేదా వైర్ అవసరం లేకుండా 5G ఇంటర్నెట్‌ను యాక్సస్ చేయొచ్చు.

ఇందుకోసం కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్ (CPE) ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ డివైజ్ BSNL 5G సిగ్నల్‌ ఇంట్లో ఇన్‌స్టాల్ చేసి రౌటర్‌కు ఇంటర్నెట్ కనెక్షన్‌ అందిస్తుంది. ఆప్టికల్ ఫైబర్ లేదా వైరింగ్ లేకుండా స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ పొందవచ్చు.

Read Also : Apple M4 MacBook Air : కొత్త ఆపిల్ ల్యాప్‌టాప్ ఇదిగో.. అతి తక్కువ ధరకే M4 మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇలా కొనేసుకోండి..!

జియో, ఎయిర్‌టెల్, Viలకు పోటీగా :
టెలికం రంగంలో ప్రైవేట్ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాకు పోటీగా BSNL 5G ఇంటర్నెట్ సర్వీసును ప్రవేశపెట్టింది. దాంతో 5G మార్కెట్లో మరింత పోటీని పెంచనుంది. BSNL 5G సర్వీసు కోసం పూర్తిగా స్వదేశీ డివైజ్‌లనే వినియోగిస్తోంది.