Apple M4 MacBook Air : కొత్త ఆపిల్ ల్యాప్‌టాప్ ఇదిగో.. అతి తక్కువ ధరకే M4 మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇలా కొనేసుకోండి..!

Apple M4 MacBook Air : ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ధర తగ్గిందోచ్.. ఈ ఖతర్నాక్ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Apple M4 MacBook Air : కొత్త ఆపిల్ ల్యాప్‌టాప్ ఇదిగో.. అతి తక్కువ ధరకే M4 మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇలా కొనేసుకోండి..!

Apple M4 MacBook Air

Updated On : June 20, 2025 / 5:40 PM IST

Apple M4 MacBook Air : కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ లేటెస్ట్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ రిలయన్స్ డిజిటల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఏడాదిలోనే లాంచ్ అయిన M4 మ్యాక్‌బుక్ (Apple M4 MacBook Air) ఎయిర్ ఏకంగా రూ. 19వేలు తగ్గింపు పొందింది.

Read Also : iPhone 16 Pro Max : ఇది కదా ఆఫర్.. కొత్త ఐఫోన్ కొనాలంటే ఇప్పుడే కొనేసుకోండి.. ఇలాంటి డిస్కౌంట్ మళ్లీ జన్మలో రాదు..!

అల్ట్రా-థిన్, అల్ట్రా-పోర్టబుల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ డీల్.. ఫొటో ఎడిటింగ్, గేమింగ్, వీడియో రెండరింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది.

ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 99,900 ఉండగా, రూ. 19వేలు సేవ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

M4 మ్యాక్‌బుక్ ఎయిర్ డీల్ :
ప్రస్తుతం 13-అంగుళాల ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 మోడల్ రూ. 90,900 ధరకు అందుబాటులో ఉంది. అసలు ధరపై రూ. 9వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 10వేలు ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

దాంతో M4 మ్యాక్‌బుక్ ఎయిర్ ధర రూ. 80,900కు తగ్గుతుంది. రూ. 3,818 ఈఎంఐతో 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

M4 మ్యాక్‌బుక్ ఎయిర్ స్పెసిఫికేషన్లు :
13-అంగుళాలు, 15-అంగుళాలు రెండు సైజుల్లో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంది. లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది.

ఈ మ్యాక్‌బుక్ MagSafe ఛార్జింగ్, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లకు సపోర్టు ఇస్తుంది. 12MP సెంటర్ స్టేజ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఫ్రేమ్‌ను ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు.

Read Also : Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో కిర్రాక్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ధర జస్ట్ రూ. 11వేలు మాత్రమే.. డోంట్ మిస్..!

ఈ ల్యాప్‌టాప్‌లో లేటెస్ట్ సిరి అప్‌డేట్స్ పొందవచ్చు. వాయిస్, టెక్స్ట్ కమాండ్స్ ఈజీ నావిగేషన్ ఉంటుంది. సిరితో పాటు రైటింగ్ టూల్స్‌లో చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్ ద్వారా ఏఐ-ఆధారిత అసిస్టెన్స్ కూడా అందిస్తుంది. 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.