×
Ad

Electric Car : సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు..ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం

వాహన తయారీ రంగంలో ఉన్న బీవైడీ.. ‘ఈ6’ పేరుతో కొత్త ప్రీమియం ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని తయారు చేసింది.

  • Published On : November 2, 2021 / 10:55 AM IST

Car

BYD India e6 EV MPV : వాహన తయారీ రంగంలో ఉన్న బీవైడీ.. ‘ఈ6’ పేరుతో సరికొత్త ప్రీమియం ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని తయారు చేసింది. వీటి ధర ఎక్స్‌షోరూంలో రూ.29.6 లక్షలుగా ఉంది. ఈ మల్టీ పర్పస్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌లో 71.7 కిలోవాట్‌ అవర్‌ లిథియం ఐరన్‌ పాస్పేట్‌ బ్లేడ్‌ బ్యాటరీ పొందుపరిచారు.

ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 180 ఎన్‌ఎం టార్క్, గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు, 580 లీటర్ల బూట్‌ స్పేస్, వంటి హంగులు ఉన్నాయి.

Corona Cases : దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, 443 మరణాలు

వాహనం వారంటీ మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్లు, బ్యాటరీ 8 ఏళ్లు లేదా 5,00,000 కిలోమీటర్లు, ట్రాక్షన్‌ మోటార్‌ 8 ఏళ్లు లేదా 1,50,000 కిలోమీటర్లు ఆఫర్‌ చేస్తోంది.