BAT-BMS EV : చైనా యాప్‌లతో నిజంగా EV కారు, బైక్ ఆగిపోతాయా? BAT-BMS టెక్నాలజీ ఏంటి? వాహనదారులు ఏం చేయాలంటే?
BAT-BMS EV : చైనా యాప్ లతో ఎలక్ట్రిక్ బైకు, కార్లు నిజంగా ఆగిపోతాయా? జస్ట్ కేవలం ఫోన్ ద్వారా ఎవరైనా వాహనాలను కంట్రల్ చేయొచ్చా? అలా అయితే వాహనదారులు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..
BAT-BMS EV
- చైనా యాప్‌లతో ఈవీ వాహనాలను కంట్రోల్ చేయొచ్చా?
- బ్యాట్-బీఎంఎస్ టెక్నాలజీ ఏంటి? ఎలా వర్క్ అవుతుంది?
- వాహనదారులు ఏం తెలుసుకోవాలి? నివారణకు ఏం చేయాలి?
BAT-BMS EV : ఈ-రిక్షాలే కాదు.. ఈవీ కార్లు, బైకులకు కూడా ఇలానే ఆగిపోతాయా? ఈవీ కార్ల వాహనదారుల్లో ఇదే ఆందోళన మొదలైంది. ఈవీ బ్యాటరీలకు కనెక్ట్ అయ్యే బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా వాహనాన్ని చైనా యాప్ లతో సింపుల్ ఆపోచ్చా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు.. రాత్రి వేళ రద్దీ రోడ్డుపై వెళ్లే ఓ ఈ-రిక్షా సడన్ గా ఆగిపోయింది.
డ్రైవర్ ఎంత ప్రయత్నించినా అది మూవ్ అవ్వలేదు. బ్యాటరీ డెడ్ అయిందని డిస్ ప్లే చూపిస్తోంది. కొద్ది దూరంలో (BAT-BMS EV) నిలబడిన ఒక వ్యక్తి తన ఫోన్లో యాప్‌ను చూసి వెనక్కి తిరిగినట్టు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలతో ఈవీ వాహనదారల్లో కొత్త భయం మొదలైంది. ఏంటి.. ఈవీ వాహనాలను ఎవరైనా రిమోట్‌గా ఆపగలరా? ఇదే ప్రశ్న అందరిలోనూ ఆందోళన రేకిత్తిస్తోంది.
ఈ క్రమంలోనే ఆన్ లైన్, సోషల్ మీడియా చర్చల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఒకటే.. (Shenzhen Grenergy Technology) రూపొందించిన (BAT-BMS) యాప్. ఇది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాను చూపించే సింపుల్ యాప్ మాత్రమే. ఛార్జ్ స్టేటస్, వోల్టేజ్, టెంపరేచర్, సెల్ హెల్త్ వంటి డేటాను డ్రైవర్‌కు సమాచారం అందిస్తుంది. కానీ, సోషల్ మీడియాలో ఇది వాహనాన్ని ఆపే టూల్‌గా ప్రచారం చేస్తున్నారు.
ఇష్యూ యాప్‌లో కాదు.. సిస్టమ్ డిజైన్ లోనే.. :
వాస్తవానికి, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా ఇలాంటి BMS యాప్‌లు వాహనాన్ని కంట్రోల్ చేయడమే కాదు.. మానిటర్ చేసేందుకు మాత్రమే వాడుతారు. అయితే, అసలు సమస్య యాప్‌లో లేదని గమనించాలి. అది మొత్తం సిస్టమ్ డిజైన్లోనే ఉంటుంది. కొన్ని ఈవీ వాహనాల్లో క్లౌడ్ కనెక్టివిటీ, రిమోట్ డయాగ్నస్టిక్స్ లేదా ఫర్మ్‌వేర్ అప్డేట్ ఫీచర్లు ఉంటే.. తయారీదారు స్థాయిలో కొన్ని లిమిట్స్ అమలు చేయొచ్చు. కానీ, ఇది ప్రతి వాహనానికి వర్తించదు.
వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలివే :
మొదటిది.. మీరు వాడుతున్న యాప్ అఫీషియల్ అవునో కాదో చెక్ చేయండి. థర్డ్ పార్టీ యాప్‌లు లేదా అనధికార APKలు వాడటం చాలా ప్రమాదకరం. ఇవి డేటా లీక్ మాత్రమే కాదు.. సిస్టమ్ యాక్సెస్ సమస్యలకు కూడా దారితీయవచ్చు.
రెండోది.. మీ ఈవీ లేదా బ్యాటరీకి సంబంధించిన లాగిన్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయొద్దు. వీక్ పాస్వర్డ్స్ వాడితే హ్యాకింగ్ రిస్క్ పెరుగుతుంది. సాధ్యమైతే టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA)ను కూడా ఎనేబుల్ చేయండి.
మూడోది.. బ్లూటూత్ లేదా యాప్ కనెక్షన్ అవసరం లేకుండా వెంటనే ఆఫ్ చేయండి. అనవసరంగా ‘always on’ కనెక్టివిటీ ఉండటం సెక్యూరిటీ రిస్క్ పెరుగుతుంది.
నాల్గోది.. వాహన ఫర్మ్‌వేర్, యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. పాత వెర్షన్లలో సెక్యూరిటీ లోపాలు ఉండే ఛాన్స్ ఎక్కువ..
ఐదోవది.. వాహనం కొనుగోలు చేసే ముందు BMS, సాఫ్ట్వేర్ ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకోండి. ‘రిమోట్ మేనేజ్మెంట్’ ఉందా? అది కంట్రోల్ ఎలా చేస్తుందో స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి.
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో నిజమైన టెక్నికల్ కాదు.. చాలా సందర్భాల్లో మోసాలు లేదా టెక్నికల్ ఫాల్ట్స్ కూడా కావచ్చు. మొత్తంగా చూస్తే.. ఈవీ టెక్నాలజీ అనేది డేంజరస్ కాదు.. అదేలా వాడుతున్నామో అదే ముఖ్యం. సరైన అవగాహన, సేఫ్ యూజ్ ప్రాక్టీసు ఉంటే ఇలాంటి భయాలను ఈజీగా నివారించొచ్చు.
