ChatGPT Astra : IRCTCలో నా కోసం ట్రైన్ టికెట్ బుక్ చేయి.. GPT-6 Astra ఏం చేసిందో చూడండి!

GPT-6 Astra : జీపీటీ-6 ఆస్ట్రా ఐఆర్‌సీటీసీ రైలు టికెట్‌ను బుక్ చేసిందంటూ ఓ క్రియేటర్ చేసిన ప్రయోగం వైరల్ అవుతోంది. ముంబై-రాజ్‌కోట్ ప్రయాణంపై జరిగిన ఈ ఏఐ టెస్ట్ ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

GPT-6 Astra book IRCTC ticket

  • ఇక AI చెప్పడమే కాదు.. IRCTC టికెట్ కూడా బుక్ చేయగలదు
  • ఏఐ అసిస్టెంట్ నుంచి ఏఐ ఏజెంట్ వరకు.. GPT-6 ఆస్ట్రా కొత్త ప్రయోగం
  • ముంబై-రాజ్‌కోట్ రైలు టికెట్‌ను ఏఐ ఎలా బుక్ చేసిందంటే?

ChatGPT-6 Astra : అడగడం తెలియాలే కానీ ఏది అడిగినా ఏఐ టక్కున దానికి సొలుష్యన్ వెతికి పెడుతుంది? అందుకు ఈ ప్రయోగమే నిదర్శనం.. ఓ వ్యక్తి తన ట్రైన్ టికెట్ కోసం చేసిన ప్రయోగం ఫలించింది. ఏఐ చెప్పినట్టే ఐఆర్ సీటీసీలో టికెట్ బుకింగ్ చేసి పెట్టింది. ఇకపై ఏఐని ఏదైనా అడిగితే సమాధానం చెప్పడమే కాదు.. మనం చేయాల్సిన పనిని కూడా అదే చేస్తుందని చెప్పొచ్చు. GPT-6 ఆస్ట్రాతో ఓ వ్యక్తి చేసిన ప్రయోగం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే? :
సాధారణంగా IRCTC వెబ్‌సైట్‌లో మనమే రైలు, తేదీ, ప్రయాణికుల వివరాలు ఎంచుకుని టికెట్ బుక్ చేయాలి. కానీ, ఈ పనిని ఏఐకి అప్పగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఓ క్రియేటర్ ప్రయత్నించాడు. GPT-6 ఆస్ట్రాను రెండు మూడు రోజులుగా టెస్టింగ్ చేస్తన్నానని ఆ వ్యక్తి చెప్పాడు.

Read Also : Alla Nani : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. వైఎస్ జగన్, నారా లోకేష్ సంతాపం

ఈ సమయంలో ఏఐ సామర్థ్యం తనను పదేపదే ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి.. ఐఆర్‌సీటీసీ టికెట్‌ను కూడా బుక్ చేయగలదా? అని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ముంబై నుంచి రాజ్‌కోట్ వెళ్లే రైలు ప్రయాణాన్ని ఇందుకోసం ఎంచుకున్నాడు.

ఏఐ టికెట్ ఎలా బుక్ చేసిందంటే.. :
క్రియేటర్ చెప్పిన ప్రకారం.. తాను ఇచ్చిన సూచనల ఆధారంగా GPT-6 ఆస్ట్రా బుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అంటే కేవలం IRCTCలో టికెట్ ఎలా బుక్ చేయాలో వివరించడమే కాదు.. అవసరమైన స్టెప్స్ అదే స్వయంగా పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నాడు. చివరికి టికెట్ బుక్ కావడంతో తాను షాక్‌కు గురయ్యానని చెప్పాడు. ఏఐకి ఎలా చేయాలి? అని అడిగే రోజులు పోయి.. నువ్వే చేసి పెట్టు అని చెప్పే రోజులు వస్తున్నాయా? అనే ఆసక్తి ఈ ప్రయోగంతో మొదలైంది.

ఏఐ అసిస్టెంట్ నుంచి AI ఏజెంట్ వరకు.. :
ఈ ప్రయోగం సక్సెస్ అయిందని క్రియేటర్ చెప్పినప్పటికీ, టికెట్ వివరాలు, పేమెంట్ టైమ్ ఏం జరిగింది, మొత్తం ప్రాసెస్‌లో మాన్యువల్ ఏమైనా మనమే చేయాల్సి వస్తుందా? అనే విషయాలను అతడు పూర్తిగా వెల్లడించలేదు. ప్రతి ఐఆర్‌సీటీసీ బుకింగ్‌ను ఏఐ ఇదే విధంగా పూర్తి చేస్తుందని ఇప్పుడే చెప్పలేం..

అయితే ఈ ప్రయోగం మాత్రం ఏఐ భవిష్యత్తులో రైలు టికెట్ల నుంచి హోటల్ బుకింగ్స్, అపాయింట్‌మెంట్స్, ఇతర ఆన్‌లైన్ పనుల వరకు అన్ని డిజిటల్ పనులను ఏఐనే స్వయంగా పూర్తి చేసేలా కనిపిస్తోంది. అదే జరిగితే ఏఐ అసిస్టెంట్లు నిజమైన ‘డిజిటల్ ఏజెంట్లు’గా మారే అవకాశం ఉంది.