ChatGPT Tech Tips : ఒకే రోజులో రూ. 10వేలు సంపాదించడం ఎలా? అని అడిగితే.. ChatGPT ఎలాంటి టిప్స్ ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు!

ChatGPT Tech Tips : డిజిటల్ టెక్నాలజీలో (ChatGPT) అనేది ఒక సంచలనం.. ప్రపంచమంతా (AI ChatBot) గురించే మాట్లాడుకుంటోంది. ఈ చాట్ జీపీటీని ఏ విషయాలు అడిగినా టక్కున కచ్చితమైన సమాధానాలను అందిస్తోంది.

ChatGPT Tech Tips : ప్రపంచమంతా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వచ్చిన (ChatGPT AI) గురించే తీవ్రంగా చర్చిస్తోంది. సెర్చ్ ఇంజిన్ గూగుల్‍ (Google) కూడా ఈ AI చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’కి ఛాలెంజ్ విసురుతోంది. ఓపెన్ AI (OpenAI) సంస్థ ప్రవేశపెట్టిన ఈ చాట్ జీపీటీ టెక్ రంగంలో అనేక పెనుమార్పులకు దారితీస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయోననే ఆందోళన కూడా మొదలైంది. వాస్తవానికి చాట్ జీపీటీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial intelligence) AI టూల్.. చాట్ జీపీటీ అంటే.. చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ (Chat Generative Pre Trained Transformer) అని పిలుస్తారు.

అడ్వాన్స్‌డ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీతో చాట్‍ GPT వర్క్ చేస్తుంది. మీరు ఈ చాట్ (GPT)ని ఎలాంటి ప్రశ్న అయినా అడగవచ్చు. అన్ని సమాధానాలను టెక్స్ట్ రూపంలోనూ అడగవచ్చు. ఏ ప్రశ్న అడిగినా AI టూల్ వివరణతో కూడిన సమాధానాన్ని చాలా వేగంగా వివరంగా అందిస్తుంది. ఈ చాట్ GPTలో చాలా డేటా బేస్ అందుబాటులో ఉంది. దీని డేటా బేస్ సాయంతో ఎలాంటి ప్రశ్నకైనా క్షణాల వ్యవధిలో సమాధానాలను ఇస్తుంది. అంతేకాదు.. ChatGPT అనేక టెక్ టిప్స్ కూడా అందిస్తుంది. తక్కువ సమయంలోనే ఈ చాట్ జీపీటీ చాలా పాపులర్ అయింది. అనేక సర్వీసులకు చాలా విషయాలలో ఉపయోగకరంగా ఉందని నిరూపితమైంది.

Read Also : ChatGPT: చాట్‌జీపీటీ వాడుతున్నారా? అయితే.. ఈ విషయం తెలుసుకోండి! లేదంటే..

సాధారణంగా చాట్ జీపీటీని ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇస్తుంది. ఒకవేళ.. మీరు డబ్బును ఎలా సంపాదించవచ్చు అని అడిగితే దానిపై కొన్ని చిట్కాలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు.. ఒక్క రోజులో రూ. 10వేల వరకు ఎలా సంపాదించాలి? అని ChatGPTని అడిగితే.. అది ఇచ్చిన సమాధానాలను చూసి టెక్ నిపుణులు సైతం కంగుతిన్నారు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించడం ఎలా అనేదానిపై కూడా కొన్ని ప్రశ్నలను అడిగి చూశారు. దానికి AI టూల్.. అందుకు కచ్చితమైన మార్గాన్ని అందించలేదు. కానీ,  సంపాదనపరమైన లక్ష్యాలను సాధించడంలో కొన్ని టిప్స్ అందించింది. డబ్బు సంపాదించాలనుకుంటే.. త్వరగా ఆదాయాన్ని ఎలా సంపాదించాలని భావించే వ్యక్తులకు ChatGPT చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ChatGPT Tech Tips : (Photo : Google)

ఆసక్తికరంగా, ఈ టూల్ స్టాక్‌లలో ఎలా పెట్టుబడి పెట్టాలి? యాప్‌ని ఎలా క్రియేట్ చేయాలి? లేదా (Instagram)ని ఉపయోగించి డబ్బు సంపాదించడం ఎలా అనే దానిపై టిప్స్ కూడా అందిస్తుంది. చాట్ జీపీటీ ఈ టిప్స్ అందించడానికి ముందు.. టూల్ వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది. ‘త్వరగా డబ్బు సంపాదించే మార్గంతో పాటు ఏదైనా త్వరగా ధనవంతులయ్యే స్కీమ్స్ లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదా ఆమోదించడం కోసం కాదని సూచించింది.

భారత్‌లో ఒకే రోజులో డబ్బు సంపాదించడానికి అనుమతించే చట్టబద్ధమైన మార్గాలను అందించగలదని ChatGPT AI  సూచించింది. అలాగే, ChatGPT అందించిన టిప్స్ చూస్తే.. ఒకే రోజులో రూ. 10వేల వరకు సంపాదించవచ్చునని చెప్పలేదు. అయితే, మీరు డబ్బు సంపాదించడానికి పైన పేర్కొన్న పద్ధతులను ప్రయత్నించవచ్చునని మాత్రమే తెలిపింది.

ఒకే రోజులో డబ్బు సంపాదించడంపై ChatGPT టిప్స్ ఇవే :
‘ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయించాలని టూల్ సూచించింది. మీకు ఉపయోగపడని వస్తువులు మీ వద్ద ఉంటే ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. మీరు వాటిని (Amazon), (Flipkart) లేదా (OLX) వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో లిస్టు చేసి డబ్బులు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ సర్వేలలో కూడా పాల్గొనవచ్చు. చాలా పరిశోధన సంస్థలు ఆన్‌లైన్ సర్వేలలో పాల్గొనేందుకు వ్యక్తులకు డబ్బు చెల్లిస్తాయి. తగిన మొత్తంలో డబ్బు సంపాదించడానికి మీరు మల్టీ సర్వేలను పూర్తి చేయవచ్చు’ అని ChatGPT రాసుకొచ్చింది.

ఫ్రీలాన్సింగ్ అనేది మరో బెస్ట్ ఆప్షన్. ఎవరైనా రచన, వెబ్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్ లేదా ప్రోగ్రామింగ్‌లో ఫ్రీలాన్సింగ్‌ను ప్రయత్నించవచ్చు. Upwork, Fiverr, Freelancer.com వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు క్లయింట్‌లను అడుగుతుంటాయి. స్వల్పకాలిక ప్రాజెక్ట్‌లలో పని చేసేందుకు అవకాశాలను అందిస్తాయి. ఫ్రీలాన్సింగ్ అంటే… ఎలా పని చేస్తుందో అర్థం చేసుకున్న తర్వాత ఒక రోజులో పెద్ద మొత్తంలో డబ్బును పొందవచ్చు.

ఆన్‌లైన్ ట్యూటరింగ్ చాలా మందికి బెస్ట్ ఆప్షన్. ఆన్‌లైన్‌లో విద్యార్థులకు టీచింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. వేదాంతం, అనాకాడెమీ, బైజూస్ వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌లు మీకు టీచింగ్ ఇవ్వడానికి సంపాదించడానికి అనుమతిస్తాయి.

చివరిగా, టూ వీలర్ లేదా ఫోర్-వీలర్ ఉన్న వ్యక్తులు స్విగ్గీ, జొమాటో లేదా ఉబెర్ ఈట్స్ వంటి ఫుడ్ డెలివరీ సర్వీస్‌లు లేదా అమెజాన్ ఫ్లెక్స్, డన్జో లేదా షాడోఫ్యాక్స్ వంటి ప్యాకేజీ డెలివరీ సర్వీస్‌లతో పని చేయవచ్చు. అలాగే, ప్యాకేజీలను డెలివరీ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ChatGPT సూచించింది.

Read Also : ChatGPT Whatsapp : వాట్సాప్‌లో మెసేజ్‌ చేయడం మీకు నచ్చదా? ఈ ChatGPT టూల్.. మీ వాట్సాప్ మెసేజ్‌లకు అదే ఆన్సర్ ఇస్తుంది తెలుసా?

ట్రెండింగ్ వార్తలు