Mind Control: శత్రువు మెదడును శాసించే టెక్నిక్ కనిపెడుతున్న చైనా

శత్రువుల మెదడును నియంత్రించే ఆయుధాలను' చైనా అభివృద్ధి చేస్తోందని రీసెంట్ రిపోర్టులో వెల్లడైంది. చైనా ప్రస్తుతం 'బయోటెక్నాలజీ'గా పిలిచే ఆయుధాలను డెవలప్ చేస్తుంది. కీలక ఆయుధాలలో ఒకటే ఈ మైండ్ కంట్రోలింగ్ ఆయుధాలు.

Mind Control

 

 

Mind Control: శత్రువుల మెదడును నియంత్రించే ఆయుధాలను’ చైనా అభివృద్ధి చేస్తోందని రీసెంట్ రిపోర్టులో వెల్లడైంది. చైనా ప్రస్తుతం ‘బయోటెక్నాలజీ’గా పిలిచే ఆయుధాలను డెవలప్ చేస్తుంది. కీలక ఆయుధాలలో ఒకటే ఈ మైండ్ కంట్రోలింగ్ ఆయుధాలు.

చైనా త‌యారుచేయ‌నున్న మైండ్ కంట్రోల్ వెప‌న్స్‌..సాంప్ర‌దాయ ఆయుధాల‌కు భిన్నంగా ప‌నిచేస్తాయి. సాంప్ర‌దాయ ఆయుధాలు వ్య‌క్తిని భౌతికంగా గాయ‌ప‌రిస్తే.. ఈ మైండ్ కంట్రోల్ వెప‌న్స్ శ‌త్రువును మాన‌సికంగా అదుపులోకి తీసుకుంటాయి. శత్రువును క‌ద‌ల‌కుండా చేస్తాయి. ప్ర‌త్య‌ర్థిని స్తంభింప‌జేస్తాయి.

ఫిజికల్ అటాక్ చేయడానికి వచ్చిన శత్రువు వ్యూహాలను పసిగట్టి ఆయుధాలకు ధీటుగా ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Read Also: మైండ్‎తో కంట్రోల్ చేసే కార్…. మనసులో అనుకుంటే చాలు.. స్టార్ట్

బయోటెక్నాలజీ వంటి కీలక రంగాలపై కంట్రోలింగ్ సాధించి.. అమెరికా టెక్నాలజీని పొందేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రమాద ఘంటికలు మోగించింది.

చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ “జన్యు సవరణ, మానవ పనితీరు ఇంప్రూవ్మెంట్, మైండ్ మెషీన్ ఇంటర్‌ఫేస్‌లు” వంటి రంగాలలో టెక్నాలజీ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌కు సమాచారం అందింది.

గత మూడు దశాబ్దాలలో చైనా సైనిక సామర్థ్యాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. రాబోయే సంవత్సరాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ US మిలిటరీ స్థాయికి చేరుకోవచ్చని చాలామంది భయపడుతున్నారు.