Chinese Smartphone Makers : భారత్‌లో ఫోన్ల తయారీకి 3 చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల ప్లాన్..!

Chinese Smartphone Makers : భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌కు గ్లోబల్ హబ్‌గా మారుతోంది. ప్రపంచ దేశాలు తమ స్మార్ట్ ఫోన్లను తయారుచేసేందుకు భారత్ వైపు దృష్టిసారిస్తున్నాయి.

Chinese Smartphone Makers : భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌కు గ్లోబల్ హబ్‌గా మారుతోంది. ప్రపంచ దేశాలు తమ స్మార్ట్ ఫోన్లను తయారుచేసేందుకు భారత్ వైపు దృష్టిసారిస్తున్నాయి. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు భారత్‌ను ప్రధాన స్మార్ట్ ఫోన్ల తయారీ కేంద్రంగా మార్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే.. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్లు అయిన Xiaomi, Oppo, Vivo మూడు స్మార్ట్ ఫోన్ల దిగ్గజాలు భారతీయ తయారీదారులతో చర్చలు జరుపుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో తమ స్మార్ట్ ఫోన్లను తయారు చేసి ఇక్కడి నుంచే గ్లోబల్ మార్కెట్లోకి ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. Xiaomi Corp, Oppo, Vivo భారత్‌లో స్మార్ట్ ఫోన్లను అసెంబ్లింగ్ చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో వాటిని ఎగుమతి చేయడానికి Lava ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Dixon Technologies India Ltd)తో చర్చలు జరుపుతున్నాయని నివేదిక తెలిపింది. దీనిపై ఇప్పటివరకూ ఈ మూడు చైనా స్మార్ట్ ఫోన్ మేకర్లు స్పందించలేదు.

కానీ, ఇప్పటికే Oppo, Vivo కంపెనీలు లావాతో చర్చలు ప్రారంభించాయని నివేదిక తెలిపింది. భారత మార్కెట్లో తన వార్షిక ఉత్పత్తిని 60 మిలియన్ యూనిట్లకు పెంచడం ద్వారా 2022 చివరి నాటికి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులను ప్రారంభించనున్నట్టు గతంలో వివో ప్రకటించింది. అయితే ఈ ఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి అన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ లేదా PLI ప్రయోజనం పొందాలని భావిస్తున్నాయి. మరోవైపు.. భారత ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులను స్వాగతిస్తోంది. ఈ క్రమంలోనే PLI 2020లో ప్రవేశపెట్టడం జరిగింది. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గా అవతరించింది. అందుకే చైనా స్మార్ట్ ఫోన్ మేకర్లు తమ దేశం తర్వాత భారత్‌ను తదుపరి స్మార్ట్ ఫోన్ హబ్ గా భావిస్తున్నాయి.

Chinese Smartphone Makers : Xiaomi, Oppo And Vivo To Make Phones In India And Export Them Globally Report

అయినప్పటికీ భారత్ ఎలక్ట్రానిక్స్ వినియోగం కోసం ఎక్కువగా ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. చాలావరకు స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఫోన్‌లను భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించాయి. తద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. స్మార్ట్ ఫోన్ల తయారీదారులు కూడా ఒకే దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారు. అందులోనూ చిప్ కొరత, ప్రపంచ కరోనా మహమ్మారి వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలా అనేక కారణాల వల్ల గత రెండు ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు సవాలుగా మారింది. అమెరికాతో చైనా తీవ్ర వాణిజ్య యుద్ధం కారణంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులను తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని నివేదిక పేర్కొంది.

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో ఊపందుకోనుంది. డెలాయిట్ నివేదిక ప్రకారం.. భారత స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 2022 నుంచి 2026 వరకు 1.7 బిలియన్ యూనిట్‌లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రధాన విధాన సంస్కరణలు, టెల్కోలు తమ వ్యాపారాలను పునరుద్ధరించడం ద్వారా 250 బిలియన్ల డాలర్ల మార్కెట్‌ను సాధిస్తుందని అంచనా. 2026 నాటికి భారత్ దాదాపు 1 బిలియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను కలిగి ఉంటుందని, తద్వారా రాబోయే ఐదేళ్లలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా అవతరించనుందని నివేదిక చెబుతోంది.2020 మధ్యలో ప్రభుత్వ ప్రోత్సాహకాల కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అప్పటినుంచి అనేక ప్రధాన స్మార్ట్ ఫోన్ల మేకర్లు తమ కంపెనీల పేర్లను ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం నమోదు చేసుకున్నాయి. ఐదేళ్ల నుంచి ఆరు ఏళ్లలో మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో 150 బిలియన్ డాలర్లను రాబట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : New Smartphones: మార్కెట్లో కొత్త ఫోన్ల సందడి: ఐఫోన్, శాంసంగ్, రెడ్మి నుంచి కొత్త ఫోన్లు

ట్రెండింగ్ వార్తలు