Free Diwali Gifts Scam : మీకు ఫ్రీ దీపావళి గిఫ్ట్స్ అంటూ మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. చైనీస్ వెబ్‌సైట్ల పనే.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..!
Free Diwali Gifts Scam : మరో మూడు రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సీజన్ కావడంతో ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ మార్కెట్లు సందడిగా ఉంటాయి. వినియోగదారులు పండుగ సీజన్‌లో తమకు నచ్చిన ప్రొడక్టులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Chinese websites stealing sensitive information from Indian users with free Diwali gifts scam Here is how you can stay safe
Free Diwali Gifts Scam : మరో మూడు రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సీజన్ కావడంతో ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ మార్కెట్లు సందడిగా ఉంటాయి. వినియోగదారులు పండుగ సీజన్‌లో తమకు నచ్చిన ప్రొడక్టులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకునేందుకు ట్రిక్స్ వాడుతుంటారు. అమాయకపు వినియోగదారులు తెలియక వారి వలలో చిక్కకునే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.
ఎందుకంటే.. చాలా మంది సైబర్ దాడులకు పాల్పడేవారు.. ఫ్రీగా దీపావళి బహుమతి స్కామ్ (Free Diwali Gifts Scam)లతో వినియోగదారులను మోసగించే అవకాశం ఉంది. భారత్‌లో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) సైబర్ మోసాల గురించి వినియోగదారులను హెచ్చరించింది. కొన్ని చైనీస్ వెబ్‌సైట్‌లు ఉచిత దీపావళి కానుకలంటూ వాగ్దానం చేస్తూ వినియోగదారులకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నట్లు గుర్తించారు. ఈ లింకులను క్లిక్ చేయడం ద్వారా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్లు, మరిన్నింటి వంటి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు.

Chinese websites stealing sensitive information from Indian users with free Diwali gifts scam
ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉండాలని కోరుతూ CERT-In ఒక అడ్వైజరీని జారీ చేసింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్) ఫేక్ మెసేజ్‌లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. పండుగ ఆఫర్‌ను తప్పుడుగా క్లెయిమ్ చేస్తూ యూజర్లను గిఫ్ట్స్ లింక్‌లు, బహుమతులంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిసింది. Whatsap/Telgram/Instagram అకౌంట్లలో తోటివారితో లింక్‌ను షేర్ చేయరాదు’ CERT-ఇన్ అడ్వైజరీ తెలిపింది. ఈ వెబ్‌సైట్‌లు Chinese .cn డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లను ఉపయోగిస్తున్నాయి. మరికొన్ని .xyz, .top వంటి ఎక్స్‌టెన్షన్‌లను ఉపయోగిస్తున్నందున ఈ ఫిషింగ్ వెబ్‌సైట్‌లు చాలా వరకు చైనాకు చెందినవని CERT-in వివరించింది.
వినియోగదారులు మొదట ఫేక్ లింక్‌ను పొందే అవకాశం ఉందని వెబ్‌సైట్ వివరించింది. బహుమతులని నమ్మబలికి లింక్‌పై క్లిక్ చేసేలా అమాయక వినియోగదారులు ఆకట్టుకునేలా చేస్తాయి. వినియోగదారులు ఆ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు.. ఫేక్ కంగ్రాట్స్ అనే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు తెలియకుండానే వినియోగదారుని వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. బహుమతిని క్లెయిమ్ చేసేందుకు వాటిని స్నేహితులు, బంధువులతో షేర్ చేయమని యూజర్లను అడుగుతారు. ఫ్రీగా బహుమతి వస్తుంది కదాని తొందరపడితే మీ విలువైన వ్యక్తిగత డేటా మొత్తం మోసగాళ్లకు చిక్కుతుంది.

Chinese websites stealing sensitive information from Indian users with free Diwali gifts scam
ఆన్‌లైన్ స్కామ్‌ను ఎలా నివారించాలంటే? :
అలాంటి స్కామ్‌లను నివారించడానికి.. మీరు ఫేక్ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎల్లప్పుడూ ఆయా లింకులు ఎక్కడి నుంచి వచ్చాయో పరిశీలించాలి. ఫేక్ లింకులు సరిగా ఉండవు. ఆ లింకులను చెక్ చేయాలి. ముఖ్యంగా డొమైన్ పేరు ఎల్లప్పుడూ చెక్ చేయాలి. మీరు ఎప్పుడైనా లింక్ గుర్తుతెలియని సోర్స్ నుంచి వచ్చినట్లు భావిస్తే.. మీరు దానిపై క్లిక్ చేయకూడదు. మీరు తొందరపడి ఆ లింక్‌పై క్లిక్ చేయరాదు. వెంటనే ఆయా లింకులను డిలీట్ చేసేయండి. అప్పుడు మీ వ్యక్తిగత డేటా సైబర్ మోసగాళ్ల బారినపడకుండా సేఫ్‌గా ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..