Chrome Browser Fix : మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే తగ్గిపోతుందా? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కారణమని తెలుసా? ఇదిగో ఇలా ఫిక్స్ చేసుకోండి!

Chrome Browser Fix : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) క్రోమ్ యూజర్ల కోసం కొత్త మెమరీ సేవర్ ఎనర్జీ సేవర్ మోడ్‌లను విస్తృతంగా రిలీజ్ చేస్తోంది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ పనితీరును మెరుగుపర్చేందుకు బ్యాటరీ లైఫ్ పొడిగించేందుకు డెవలప్ చేసింది.

Chrome Browser Fix : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) క్రోమ్ యూజర్ల కోసం కొత్త మెమరీ సేవర్ ఎనర్జీ సేవర్ మోడ్‌లను విస్తృతంగా రిలీజ్ చేస్తోంది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ పనితీరును మెరుగుపర్చేందుకు బ్యాటరీ లైఫ్ పొడిగించేందుకు డెవలప్ చేసింది. గూగుల్ (Google) గత ఏడాది డిసెంబర్ 2022లో Mac, Windows, Linux, అలాగే Chromebooksలో Chrome మెమరీ, ఎనర్జీ సేవర్ మోడ్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఫీచర్ క్రోమ్ యూజర్లు అందరికి రిలీజ్ అయింది. గూగుల్ క్రోమ్ పనితీరు సెట్టింగ్‌లకు కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఆ ఫీచర్ డిఫాల్ట్‌గా వచ్చింది. Google ప్రాధాన్యత ప్రకారం.. మెమరీ, ఎనర్జీ మోడ్‌ను ఆన్/ఆఫ్ చేసే సామర్థ్యాన్ని కూడా యాడ్ చేసింది. యాక్టివ్ ట్యాబ్‌లు సజావుగా పనిచేయడంలో కంప్యూటర్ బ్యాటరీ లైఫ్ పొడిగించడంలో సాయపడుతుంది. ఈ రెండు కొత్త ఫీచర్లను ఎలా యాక్సెస్ చేయాలో వివరంగా చూద్దాం.

Chrome మెమరీ సేవర్ మోడ్ ఫీచర్ :
గూగుల్ ప్రకారం.. Chromeలోని కొత్త ‘Memory Saver’ ఫీచర్ ఆటోమాటిక్‌గా ‘ఇనాక్టివ్ ట్యాబ్‌ల నుంచి మెమరీని ఖాళీ చేస్తుంది’ అని తెలిపింది. వినియోగదారుల కంప్యూటర్‌లలోని ఇతర పేజీలు, యాప్‌లకు మరిన్నింటిని అందించడంలో ఈ ఫీచర్ సాయపడుతుంది. ఈ మెమరీ సేవర్ ఫీచర్ మెమరీ నుంచి ఇన్‌యాక్టివ్ ట్యాబ్‌లను అన్‌లోడ్ చేయడం ద్వారా మీ కంప్యూటర్ మెమరీని సేవ్ చేయడంలో సాయపడుతుంది. మీరు మీ బ్రౌజర్‌లో అనేక ట్యాబ్‌లను ఓపెన్ ఉంచినా.. వాటిలో కొన్నింటిని కొంతకాలంగా వాడకపోయినా.. మెమరీ ఖాళీ చేసేందుకు Chrome వాటిని మీ కంప్యూటర్ మెమరీ నుంచి ఆటోమాటిక్‌గా డిలీట్ చేస్తుంది. మీరు ఆ ట్యాబ్‌లకు తిరిగి మారినప్పుడు Chrome వాటిని ఆటోమాటిక్‌గా రీలోడ్ చేస్తుంది. వాటిని మీ బ్రౌజర్ మెమరీలోకి రీడైరెక్ట్ చేస్తుంది.

కొత్త మెమరీ సేవర్ మోడ్‌ను యూజర్లు ఈ ఫీచర్ ద్వారా ఎఫెక్ట్ కాకూడదని భావిస్తే.. నిర్దిష్ట వెబ్‌సైట్‌లను ఎంచుకునేందుకు కూడా అనుమతిస్తుంది. ఈ వెబ్‌సైట్‌లు రియల్ టైంలో డేటాను అప్‌డేట్ చేసే సైట్‌లను కలిగి ఉండవచ్చు. వినియోగదారులు వారి మెమరీ సేవర్‌ను కేటగిరీ చేయొచ్చు. ఎంచుకున్న వెబ్‌సైట్‌లు ఎల్లప్పుడూ మెమరీలో లోడ్ అయి ఉంటాయి. కొత్త ఫీచర్ ద్వారా ప్రభావితం కాకుండా చూసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ క్రోమ్ బ్రౌజర్ పనితీరును మెరుగుపరచడంలో యూజర్లకు మెమరీని తగ్గించడం ద్వారా సాయపడుతుంది. సున్నితమైన బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అదనంగా, గూగుల్ మెమరీ సేవర్‌తో క్రోమ్ గరిష్టంగా 30శాతం తక్కువ మెమరీని ఉపయోగిస్తుందని, యాక్టివ్ వీడియో, గేమింగ్ ట్యాబ్‌లను సజావుగా ఓపెన్ చేసుకోవచ్చు.

Read Also : Google Chrome : గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్.. 15 నిమిషాల బ్రౌజింగ్ హిస్టరీని ఇలా డిలీట్ చేయొచ్చు!

గూగుల్ క్రోమ్ ఎనర్జీ సేవర్ మోడ్ ఫీచర్ :
మెమరీ సేవర్ మోడ్ మాదిరిగానే.. డివైజ్ బ్యాటరీపై ఆదా చేసేందుకు కొత్త ‘ఎనర్జీ సేవర్’ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ బ్రౌజర్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని లిమిట్ చేయడం ద్వారా నిర్దిష్ట యానిమేషన్‌లు, వీడియో ఫ్రేమ్ రేట్‌లను డిసేబుల్ చేస్తుంది. స్మూత్ స్క్రోలింగ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయడంతో మరింత పవర్ సేవ్ చేస్తుంది. ఈ ఫీచర్‌తో, Google ప్రాధాన్యత ప్రకారం.. ఎనర్జీ సేవర్ మోడ్‌ను సెట్ చేసేందుకు రెండు ఆప్షన్లను యాడ్ చేసింది. ఎనర్జీ సేవర్ మోడ్‌ని ఆన్/ఆఫ్ చేయడం కాకుండా క్రోమ్ యూజర్లు వీటిని కూడా ఎంచుకోవచ్చు.

Chrome browser draining your laptop battery

– బ్యాటరీ 20శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ON చేయండి.
– కంప్యూటర్ అన్‌ప్లగ్ చేసినప్పుడు ON చేయండి

క్రోమ్ మెమరీ, ఎనర్జీ మోడ్‌ని ఎలా ఆన్ చేయాలంటే? :
గూగుల్ డిఫాల్ట్‌గా మెమరీ, ఎనర్జీ సేవర్‌ని ఆన్ చేసింది. ఫీచర్‌ని ఆఫ్ చేయడానికి..

– Chrome బ్రౌజర్‌ని ఓపెన్ చేసి సెట్టింగ్‌లకు వెళ్లండి.
– ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌బార్‌లో, పర్ఫార్మెన్స్ Click చేయండి.
– మెమరీ సేవర్ లేదా ఎనర్జీ సేవర్ మోడ్‌ను ON లేదా OFF చేయండి.

ముఖ్యంగా, Google Chrome లేటెస్ట్ వెర్షన్ (v110)తో కొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తోంది. రాబోయే వారాల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మీ డివైజ్‌లో ఫీచర్ అందుబాటులో లేకుంటే.. కొత్త Chrome అప్‌డేట్ పొందడానికి కొంత సమయం వేచి ఉండండి. మీరు ఫ్లాగ్‌లను ఉపయోగించడం ద్వారా ఫీచర్‌ను ఇలా వినియోగించుకోవచ్చు.

– ఈ లింక్‌లను అడ్రస్ బార్‌లో Paste చేసి ఎంటర్ Tap చేయండి.
chrome://flags/#battery-saver-mode-available
chrome://flags/#high-efficiency-mode-available

– ఆ తర్వాత ‘సెట్టింగ్‌లలో బ్యాటరీ సేవర్ మోడ్ ఫీచర్‌ను ఓపెన్ చేయండి. ‘సెట్టింగ్‌లలో హై ఎఫిషియెన్సీ మోడ్ ఫీచర్‌ను సెట్టింగ్‌లను డిఫాల్ట్ నుంచి ఎనేబుల్ చేయండి.

Read Also : Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ iPhone 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనాలా? వద్దా?

ట్రెండింగ్ వార్తలు