CMF Phone 1 Deal : కొత్త ఫోన్ కావాలా? సీఎమ్ఎఫ్ ఫోన్ 1పై ఫెస్టివల్ ఆఫర్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

CMF Phone 1 Deal : బ్యాంక్ + ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌లు ఉండే అవకాశం ఉంది. కానీ, దీనిపై క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో ఈ ఫోన్ డీల్‌పై కచ్చితమైన వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.

CMF Phone 1 to be available

CMF Phone 1 Deal : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. అయితే, నథింగ్ ఫోన్ల వివరాలు మాత్రం ఇంకా అందుబాటులో లేవు. కంపెనీ సీఈఓ కార్ల్ పీ సీఎమ్ఎఫ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2ఎపై ఫెస్టివల్ డీల్ వెల్లడించారు. ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ మోటోరోలా ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ధర రూ. 12,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. అదే ఫోన్ భారత మార్కెట్లో రీకాల్ కోసం రూ. 15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ సీఎమ్ఎఫ్ ఫోన్‌పై 3వేల తగ్గింపు అందించడం లేదు. ఎందుకంటే.. సీఎమ్ఎఫ్ ఫోన్ ఇప్పటికే తక్కువ ధరకు అమ్ముడవుతోంది. ప్రస్తుతానికి ఈ డీల్ ఎలా పొందాలి అనేదానిపై సమాచారం లేదు.

బ్యాంక్ + ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌లు ఉండే అవకాశం ఉంది. కానీ, దీనిపై క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో ఈ ఫోన్ డీల్‌పై కచ్చితమైన వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ 2ఎ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ ఫోన్ ధరను తగ్గింపు ధరకే పొందవచ్చు. పండుగ సేల్‌లో భాగంగా ఫోన్ 2ఎ ధర రూ. 18,999కి అందుబాటులో ఉంటుందని కార్ల్ పి కంపెనీ నివేదించింది.

భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ ధర రూ. 23,999కి లాంచ్ అయింది. అయితే, దీనిపై రూ. 5వేల తగ్గింపు ఆఫర్‌ను కూడా కంపెనీ సూచిస్తుంది. బ్యాంక్ ఆఫర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రతి ఒక్కరికీ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లు ఒక రోజు ముందు సేల్‌ను యాక్సెస్ చేయగలరు. కానీ, ఫ్లిప్‌కార్ట్ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు సెప్టెంబర్ 22న నథింగ్ ఫోన్‌లకు సంబంధించిన డీల్స్ వెల్లడించనున్నట్టు ప్రకటించింది.

Read Also : Huawei Watch GT 5 Pro : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో హువావే వాచ్ జీటీ 5 ప్రో.. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, ధర ఎంతంటే?