×
Ad

CMF Phone 2 Pro : కొత్త ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లుచెదిరే డీల్.. CMF ఫోన్ 2 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. డోంట్ మిస్!

CMF Phone 2 Pro : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ సందర్భంగా సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/7
CMF Phone 2 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ ప్రారంభం కానుంది. అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. పాపులర్ మోడళ్లు భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సమయంలో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 15వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు. ఈ డీల్ చౌకైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2/7
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో రూ.18,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రూ.16,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోపై రూ.2వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది.
3/7
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే.. అదనంగా రూ.2వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ట్రేడ్ చేయవచ్చు.
4/7
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మోడల్ 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ కలర్లకు సపోర్టు అందిస్తుంది.
5/7
హుడ్ కింద, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.
6/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.
7/7
ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఫోన్ ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా కలిగి ఉంటుంది.