న్యూ ఇయర్ ఆఫర్ : జియో 100శాతం క్యాష్ బ్యాక్

జియో తన కస్టమర్ల కోసం మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని అనౌన్స్ చేసింది.

  • Publish Date - December 29, 2018 / 05:14 AM IST

జియో తన కస్టమర్ల కోసం మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని అనౌన్స్ చేసింది.

జియో తన కస్టమర్ల కోసం మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ని అనౌన్స్ చేసింది. కేవలం రూ.399 రీచార్జ్‌పై మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ ఎజియో (AJIO) కూపన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఎజియో ఆఫర్లకు తోడుగా ఈ కూపన్‌ను కూడా వాడుకోవచ్చు. మైజియో యాప్‌లో రీచార్జ్ చేయిస్తే వెంటనే రూ.399 కూపన్‌ను మైకూపన్స్ సెక్షన్‌కు యాడ్ చేస్తుంది.

ఈ కూపన్‌ను ఎజియో యాప్ లేదా వెబ్‌సైట్‌లో వాడుకోవచ్చు. కనీసం రూ.వెయ్యి కొనుగోలుపై ఈ కూపన్‌ను వాడుకునే వీలుంటుంది. 2019, జనవరి 31 వరకు ఈ ఆఫర్ అందుబాలుటో ఉంటుంది. ఈ ఆఫర్ కొత్త, పాత కస్టమర్లు అందరికీ వర్తిస్తుంది. మార్చి 15లోపు కూపన్లను రీడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.