Gearless Scooter Into An Electric Scooter
Gearless Scooter Into Electric Scooter : దేశంలో ఇందన ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాహనదారులంతా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ స్కూటర్లు, బైకులకు భారత మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే చాలామంది ఇందన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోయారు. అయితే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా మార్కెట్లో రానుండటంతో ఈవీ స్కూటర్లకు మరింత క్రేజ్ పెరిగింది. సాధారణంగా స్కూటర్లకు గేర్లు ఉండవు. అందుకే ఈ గేర్ లెస్ స్కూటర్లకు డిమాండ్ ఎక్కువ. డ్రైవింగ్ రానివాళ్లు కూడా ఈజీగా నడపవచ్చు.
ఒకవేళ మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే 70వేల నుంచి 80వేలు పెట్టి కొనడం అవసరమా? అనుకుంటున్నారా? మీకోసం Starya Mobility అనే స్టార్టప్ కంపెనీ ఒక స్పెషల్ కిట్ అందిస్తోంది. ఇదొక కన్వర్షన్ కిట్.. పెట్రోల్‌తో నడిచే మీ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చేస్తుంది. కస్టమర్లు కూడా ఎక్కువగా ఈ మాడిఫైడ్ ఈవీ స్కూటర్లపై ఆసక్తి చూపిస్తుండటంతో Starya Mobility కంపెనీ కూడా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లతో అతిపెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
కన్వర్షన్ కిట్ కాస్ట్ ఎంతంటే? :
మీరు ఒకవేళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే మొత్తంగా రూ.70వేల నుంచి 80వేల వరకు పెట్టాల్సి వస్తుంది. అదే ఈ కన్వర్షన్ కిట్ కు రూ.39వేలు పెడితే సరిపోతుంది. కొత్త ఈవీ స్కూటర్‌లో సగమే మీరు ఖర్చు పెట్టేది. ఒనర్ షిప్ కాస్ట్ కూడా తక్కువే.. అంతేకాదు… Starya Mobility బ్యాటరీ సర్వీసు కూడా ఆఫర్ చేస్తోంది. సాధారణ ICE-powered గేర్ లెస్ స్కూటర్ల ఇందన ఖర్చు కూడా కిలోమీటర్ కు రూ. 3 వరకు పడిపోతుంది. అదే ఈ కన్వర్షన్ కిట్ ద్వారా కిలోమీటర్ కు 1 రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది.
స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.0 KW PMSM మోటార్ కు 250A కంట్రోలర్ కనెక్ట్ చేస్తారు. అలాగే సింగిల్ ఛార్జ్‌తో 75కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ స్పీడ్ అందిస్తుంది. ఒక స్కూటర్ కు 75 కిలోమీటర్ల రేంజ్ టాప్ స్పీడ్ బెస్ట్ అనే చెప్పాలి. కిట్ తో నడిచే ఈ స్కూటర్ 0-4kph వేగాన్ని 3.9 సెకన్లలోనే చేరగలదు. ఈ కన్వర్షన్ కిట్ తో మరో బెనిఫిట్ ఏంటంటే?.. బ్యాటరీ మార్చేసుకోవచ్చు. ఛార్జింగ్ అయ్యేవరకు గంటల పాటు ఎదురుచూడాల్సిన పనిలేదు. swappable బ్యాటరీ స్టేషన్ కు సులభంగా తీసుకెళ్లొచ్చు. సబ్ స్ర్కిప్షన్ ఆధారంగా స్వాపబుల్ బ్యాటరీని పొందవచ్చు.