Aadhaar Free Update Extended : గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌ గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఇదిగో.. ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే?

Aadhaar Update Extended : మీ ఆధార్ కార్డును ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి గడువును మళ్లీ పొడిగించింది ప్రభుత్వం. కొత్త తేదీ వివరాలతో పాటు ఆధార్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Deadline to update Aadhaar details for free extended again

Aadhaar Free Update Extended : మీ ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? ఇప్పటివరకూ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయించుకోలేని వారికి మరో అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుత మార్చి 14 గడువు తేదీ సమీపిస్తున్న వేళ ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు జూన్ 14, 2024 వరకు గడువును పొడిగించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) లక్షలాది ఆధార్ కార్దుదారులకు ప్రయోజనం కల్పించేందుకు ఫ్రీ సర్వీసును అందిస్తోంది.

Read Also : Blue Aadhaar Card : బాల (బ్లూ) ఆధార్ కార్డు అంటే ఏంటి? ఈ ప్రత్యేకమైన కార్డు ఐదేళ్ల లోపు పిల్లలకు ఎందుకు ముఖ్యమంటే?

ఇప్పటివరకూ ఈ సర్వీసు (myAadhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది . ఆధార్‌లో తమ డాక్యుమెంట్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డు హోల్డర్లను యూఐడీఏఐ ప్రోత్సహిస్తోంది. మైఆధార్ పోర్టల్ మాత్రమే జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ ఆధార్ సెంటర్లలో అయితే రూ. 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 కన్నా ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే ఆపరేటర్ మీద చర్యలు తప్పవు.

ఆధార్ అనేది బయోమెట్రిక్, జనాభా సమాచారం ఆధారంగా భారత ప్రజలకు జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. 10 ఏళ్ల క్రితం జారీ చేసిన ఆఫ్‌లైన్ ఆధార్ వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ అప్‌డేట్ చేయకపోతే వారి జనాభా సమాచారాన్ని తిరిగి ధృవీకరించడానికి ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, (PoI/PoA) డాక్యుమెంట్లను సమర్పించాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకులు, ఇతర సర్వీసుల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలంటే? :

  • ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://myaadhaar.uidai.gov.in/)కి వెళ్లండి.
  • మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఉపయోగించి లాగిన్ చేయండి.
  • మీ ప్రొఫైల్‌లో కనిపించే మీ గుర్తింపు, చిరునామా వివరాలను చెక్ చేయండి.
  • మీ ప్రొఫైల్‌లోని వివరాలు తప్పుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
  • ఆ తర్వాత దయచేసి ‘పై వివరాలు సరైనవని ధృవీకరించాను’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • డ్రాప్ లిస్టు నుంచి మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఎంచుకోండి.
  • మీ గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్ చేయండి (ఫైల్ సైజు 2ఎంబీ కన్నా తక్కువ, ఫైల్ ఫార్మాట్ JPEG, PNG లేదా PDF)
  • మీరు (Submit) చేసే ముందు డ్రాప్-డౌన్ మెను నుంచి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఎంచుకోండి.
  • మీ అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి (ఫైల్ సైజు 2ఎంబీ కన్నా తక్కువ, ఫైల్ ఫార్మాట్ JPEG, PNG లేదా PDF)
  • చివరిగా Submit బటన్ ట్యాప్ చేయండి.

ఆఫ్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలంటే? :

  • యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ (https://bhuvan.nrsc.gov.in/aadhaar/)కి వెళ్లండి.
  • మీ సమీపంలోని ఆధార్ కేంద్రాల కోసం ‘Centers Nearby’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • మీ సమీపంలోని ఆధార్ కేంద్రాలను వీక్షించడానికి మీ లొకేషన్ వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ పిన్ కోడ్ ప్రాంతంలో ఆధార్ కేంద్రాలను గుర్తించండి.
  • ‘Search by PIN Code’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • ఆ ప్రాంతంలోని ఆధార్ కేంద్రాలను చెక్ చేసేందుకు మీ ఏరియా పిన్ కోడ్‌ని ఎంటర్ చేయండి.

Read Also : AP DSC Exam Revised Schedule : ఏపీ డీఎస్సీ పరీక్ష 2024 వాయిదా.. కొత్త షెడ్యూల్‌ ఇదిగో.. పరీక్ష తేదీల వివరాలివే..!

ట్రెండింగ్ వార్తలు