Delhi man receives missed calls and then loses Rs 50 lakh _ here's about the new cybercrime
New Cyber Crime : మీ మొబైల్ ఫోన్‌కు ఏదైనా కాల్ లేదా మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. అది సైబర్ మోసగాళ్లు కావొచ్చు.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయరాదు. లేదంటే.. మీ విలువైన డేటాతో పాటు బ్యాంకు అకౌంట్లు ఖాళీ అవుతాయి జాగ్త్రత్త అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వాటికి సమాధానం ఇవ్వకపోవడమే మంచిది. అంతేకాదు.. ఏదైనా మెసేజ్ లేదా ఫోన్ కాల్స్ చేసి మీ OTPని అడిగితే ఎవరితోనూ షేర్ చేయరాదు. ఫోన్ కాల్/sms/ఈ-మెయిల్ ద్వారా వన్-టైమ్-పాస్‌వర్డ్ (OTP) అడిగి సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని గుర్తించాలి.
ఈ విషయంలో సైబర్ క్రైమ్ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ OTPని షేర్ చేయకుండా కూడా సైబర మోసగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని తెలుసా? ఇటీవల జరిగిన సైబర్ మోసంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అలానే మోసపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 50 లక్షలను పొగట్టుకున్నాడు. అతడు చేసిన తప్పు ఒక్కటే.. OTP షేర్ చేయలేదు.. కానీ, అతడి ఫోన్‌కు మిస్డ్ కాల్స్ వచ్చాయి. తద్వారా ఆ బాధితుడు రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. ముఖ్యంగా, సైబర్ మోసగాళ్లు అతనిని ఏ OTP అడగలేదు. బాధితుడి మల్టీ అకౌంట్లలో అనేక లావాదేవీలు చేసి లక్షల రూపాయలు కాజేశారు.
దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సైబర్ మోసం కారణంగా రూ.50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం, బాధితుడికి కొన్ని రోజుల క్రితం రాత్రి 7 నుంచి 8.45 గంటల మధ్య అతని సెల్ ఫోన్‌లలో వరుసగామిస్డ్ కాల్స్ వచ్చాయి. అతడు కొన్ని కాల్స్ మాత్రం పట్టించుకోలేదు. చివరికి అతడు ఒక మిస్డ్ కాల్ ఎత్తాడు. అప్పుడు అవతలి వైపు నుంచి ఎవరూ మాట్లాడలేదు. కొంత సమయం తర్వాత బాధితుడి ఫోన్‌కు వరుసగా మెసేజ్ లు వచ్చాయి.
New Cyber Crime : Delhi man receives missed calls and then loses Rs 50 lakh
తన మొబైల్ ఫోన్‌ను చెక్ చేయగానే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యాడు. అంటే.. దాదాపు అర కోటి వరకు (రూ. 50 లక్షలు) రియల్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా నగదు బదిలీ జరిగినట్టు గుర్తించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు జార్ఖండ్‌లోని జమ్తారాలో ఆధారితమై ఉండవచ్చునని ప్రాథమిక దర్యాప్తు అనుమానిస్తోంది. బాధితుడి అకౌంట్లో మోసపూరితంగా నగదును బదిలీ చేసిన వ్యక్తి.. కమీషన్ కోసం మోసగాళ్లకు వారి అకౌంట్లను అద్దెకు ఇచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
జమ్తారా స్కామ్ సాధారణంగా సైబర్ మోసాలతో ముడిపడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. జమ్తారా నగరంలో మోసగాళ్లు బ్యాంకు అకౌంట్ల నంబర్లు, పాస్‌వర్డ్‌లు, OTP, డబ్బు లావాదేవీలు చేసేందుకు స్క్రీన్-మిర్రరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని బాధితులను నమ్మిస్తారు. ఇటీవలి కేసులో కూడా సైబర్ మోసగాళ్లు ‘SIM Swap’ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. RTGS బదిలీని చేయాలంటే OTPని యాక్సస్ చేయడానికి బ్లాంక్ లేదా మిస్డ్ కాల్‌లు చేస్తారు. స్కామర్‌లు పక్కనే ఉన్నకాల్ IVRలో పేర్కొన్న OTPని పొందే అవకాశం ఉంది. ఈ మోసంలో స్కామర్లు ప్రజల మొబైల్ ఫోన్ క్యారియర్‌లను కూడా సంప్రదించి, SIM కార్డ్‌ని యాక్టివేట్ చేస్తుంటారు. ఆ తర్వాతే సైబర్ మోసగాళ్లు బాధితుల ఫోన్ కంట్రోల్ తమ అధీనంలోకి తీసుకుంటారనిపోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Delhi man receives missed calls and then loses Rs 50 lakh
SIM Swap మోసం అంటే ఏమిటి :
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ( two-factor authentication) ఎనేబల్ చేయని బాధితుల అకౌంట్లను యాక్సెస్ చేసేందుకు మోసగాళ్లు మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తారు. తద్వారా మీకు తెలియకుండానే మీ SIM Switch చేస్తారు. అంటే.. SIM Swap చేయడానికి మోసగాళ్ళు మీ మొబైల్ ఫోన్ SIM ప్రొవైడర్‌ని సంప్రదించి.. వారికి చెందిన SIM కార్డ్‌ని యాక్టివేట్ చేయమని అడుగుతారు.
ఫ్రాడ్ సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత.. స్కామర్‌లు బాధితుడి ఫోన్ నంబర్‌పై కంట్రోల్ కలిగి ఉంటారు. అప్పుడు మీ ఫోన్‌లోని అన్ని కాల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్‌లను పంపగలరు.. అలాగే పొందగలరు. ఈ సిమ్ స్వాప్ చీటింగ్ ద్వారా మోసగాళ్లు ఈజీగా మొబైల్ వినియోగదారులను మోసగిస్తారు. అందుకే ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఓటీపీ అడిగినా లేదా మిస్డ్ కాల్స్ చేసినా స్పందించరాదని సూచిస్తున్నారు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : DoT SMS Rule : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు కొత్త SMS రూల్.. ఇక ఎస్ఎంఎస్ ఫ్రాడ్‌కు చెక్ పడినట్టే..!