DoT SMS Rule : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు కొత్త SMS రూల్.. ఇక ఎస్ఎంఎస్ ఫ్రాడ్‌కు చెక్ పడినట్టే..!

రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్-ఐడియా (Vodafone idea)తో సహా టెలికాం ఆపరేటర్‌లను సిమ్ మార్పిడి (SIM Exchange) లేదా అప్‌గ్రేడ్ ప్రక్రియలో SMS సౌకర్యాన్ని (ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రెండూ) నిలిపివేయాలని DoT ఆదేశించింది.

DoT SMS Rule : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు కొత్త SMS రూల్.. ఇక ఎస్ఎంఎస్ ఫ్రాడ్‌కు చెక్ పడినట్టే..!

DoT issues new SMS rule for Jio, Airtel and Vodafone, will help prevent SMS fraud

DoT SMS Rule : డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) SMS (షార్ట్ మెసేజ్ సర్వీస్) కోసం కొత్త రూల్ జారీ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్-ఐడియా (Vodafone idea)తో సహా టెలికాం ఆపరేటర్‌లను సిమ్ మార్పిడి (SIM Exchange) లేదా అప్‌గ్రేడ్ ప్రక్రియలో SMS సౌకర్యాన్ని (ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రెండూ) నిలిపివేయాలని DoT ఆదేశించింది. కొత్త SIM కార్డ్‌లను యాక్టివేట్ చేసిన తర్వాత 24 గంటల పాటు SMS సర్వీసులు నిలిచిపోతాయి. ఈ కొత్త నిబంధనను అమలు చేసేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు 15 రోజుల గడువు ఇచ్చింది.

DoT issues new SMS rule for Jio, Airtel and Vodafone, will help prevent SMS fraud

DoT issues new SMS rule for Jio, Airtel and Vodafone, will help prevent SMS fraud

కొత్త నిబంధన ప్రకారం.. సిమ్ కార్డ్ (SIM Card) లేదా నంబర్‌ను మార్చమని అభ్యర్థనను స్వీకరించిన తర్వాత.. టెలికాం ఆపరేటర్లు కస్టమర్లకు అభ్యర్థనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా పంపాలి. సిమ్ కార్డ్ హోల్డర్ IVRS కాల్ ద్వారా అభ్యర్థనను మరింత ధృవీకరించాలి. అథెంటికేషన్ ప్రక్రియ అధీకృత SIM కార్డ్ హోల్డర్ నుంచి రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. కస్టమర్ ఏదైనా సమయంలో SIM కార్డ్ అప్‌గ్రేడ్ అభ్యర్థనను తిరస్కరిస్తే.. వెంటనే SIM అప్‌గ్రేడ్ ప్రక్రియను నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్‌లను కోరింది. సిమ్ స్విచ్ స్కామ్‌లు, ఇతర సంబంధిత సైబర్ క్రైమ్‌ల రిస్క్ తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తోంది.

SIM Swap అంటే ఏమిటి? :
బ్యాంకింగ్‌తో సహా పలు రకాల సర్వీసులను పొందేందుకు కస్టమర్‌లకు మొబైల్ నంబర్ ముఖ్యమైన గుర్తింపు సంఖ్యగా మారింది. సెక్యూరిటీ పాస్‌కోడ్‌లు, లావాదేవీల మెసేజ్‌లు, ఆర్థిక లావాదేవీలకు వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు, నెట్‌సెక్యూర్ కోడ్ వంటి డేటా అన్నీ మన మొబైల్ నంబర్‌కి లింక్ అవుతాయి. లావాదేవీలను ప్రారంభించేందుకు ఈ పాస్‌కోడ్‌లను ఉపయోగిస్తారు. బ్యాంక్ లావాదేవీలను కూడా ట్రాక్ చేయవచ్చు. లావాదేవీ సర్వీసులను పొందుతున్నప్పుడు two-factor authentication మోడ్‌గా మొబైల్ SMSని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ OTP నంబర్‌లకు యాక్సెస్ పొందాలంటే.. స్కామర్‌లు అదే మొబైల్ నంబర్‌తో డూప్లికేట్ SIM కార్డ్‌లను పొందడానికి ప్రయత్నించవచ్చు.

DoT issues new SMS rule for Jio, Airtel and Vodafone, will help prevent SMS fraud

DoT issues new SMS rule for Jio, Airtel and Vodafone, will help prevent SMS fraud

ఒకవేళ యూజర్ సిమ్ కోల్పోతే వెంటనే మొబైల్ ఆపరేటర్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. అదే నంబర్‌తో కొత్త సిమ్ కార్డ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త SIM యాక్టివేట్ అయిన తర్వాత.. బాధితుల మొబైల్ నంబర్‌పై కంట్రోల్ పొందవచ్చు. అన్ని సీక్రెట్ OTP నంబర్‌లు, మెసేజ్‌లకు యాక్సస్ పొందవచ్చు. బాధితుల అకౌంట్ నుంచి వారి అకౌంట్‌కు నగదు బదిలీ చేయవచ్చు. కొత్త మార్గదర్శకాలతో ఇప్పుడు వినియోగదారులు SIM Change కోసం రిక్వెస్ట్ పెడితే.. నోటిఫికేషన్‌ను పొందవచ్చు. తద్వారా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందని ముందుగానే యూజర్లకు అలర్ట్ చేస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart’s Apple Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 14, ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!