×
Ad

ATM PIN : మీ ఏటీఎం PIN ఇదేనా? అర్జంట్ గా మార్చేయండి.. ఇలా అసలు చేయొద్దు.. మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్టే..!

ATM PIN : మీ ఏటీఎం కార్డు పిన్ సెట్ చేశారా? ఇలాంటి పిన్ నెంబర్లు అసలు పెట్టుకోవద్దు.. అవేంటో ఓసారి లుక్కేయండి.

ATM PIN

ATM PIN : మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ పిన్‌ సెట్ చేసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీరు ఎప్పుడైనా మీ పిన్ నెంబర్ సులభంగా గుర్తుంచుకునేలా క్రియేట్ చేయకూడదు. ఇతరులు ఈజీగా గెస్ చేయలేని విధంగా పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి.

సాధారణంగా చాలా మంది తమ ఏటీఎం కార్డు పిన్ నెంబర్లను సులభంగా గుర్తుంచుకునేలా సెట్ చేసుకోవడం అలవాటు. కానీ, ఈ పిన్ నెంబర్ విషయంలోనే చాలామంది కస్టమర్లు పొరపాటు చేస్తుంటారు.

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలనుకున్నా లేదా ఆన్‌లైన్ పేమెంట్లు చేయాలనుకున్నా డెబిట్ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా, క్రెడిట్ కార్డ్ సాయంతో కూడా పేమెంట్ చాలా సులభం అవుతుంది.

అయితే, ఈ కార్డుల సెక్యూరిటీకి 4 అంకెల పిన్ నంబర్ చాలా ముఖ్యం. అలాంటి పిన్ నెంబర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సెట్ చేసుకునే పిన్ నెంబర్ స్ట్రాంగ్ ఉండాలి. ఇతరులు గెస్ చేసేదిగా అసలు ఉండకూడదు.

Read Also : Amazon Sale : బిగ్ అలర్ట్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఈఎంఐ ఆఫర్లు కూడా..!

చాలా సార్లు వినియోగదారులు గుర్తుంచుకునేందుకు ఈజీగా ఉండేలా పిన్ నంబర్లను క్రియేట్ చేసుకుంటారు. కానీ, అలాంటి పిన్ నంబర్లను సులభంగా హ్యాక్ చేయవచ్చు. మీరు ఈ నంబర్లను కూడా మీ పిన్‌గా మార్చుకుంటే.. వెంటనే మార్చుకోవాలి. అలాంటి పిన్ నంబర్లతో సైబర్ మోసాలకు దారితీస్తుంది. ఎందుకంటే.. మీ డేటా లీక్ అయిన సందర్భంలో, దాడి చేసేవారు మీ బ్యాంక్ అకౌంటులో డబ్బులను కాజేస్తారు జాగ్రత్త.

1. సాధారణ, వరుస నెంబర్లు :

1234
1111, 2222, 3333, 0000
4321 (రివర్స్ సీక్వెన్స్)
1212, 1122 (రిపీట్ ప్యాట్రన్)

2. పుట్టిన తేదీకి సంబంధించిన నెంబర్లు :
మీ పుట్టిన తేదీ (1901, 2511, 1508)
మీ పుట్టిన సంవత్సరం (1988, 1993)
ఫ్యామిలీ మెంబర్లలో ఎవరిదైనా పుట్టిన తేదీ

3. ఈజీగా గెస్ చేయగలిగే నెంబర్లు :
– మీ మొబైల్ నంబర్ చివరి 4 అంకెలు
– మీ వాహనం నంబర్
– ఐడీ కార్డ్ లేదా ఆధార్ కార్డుకు సంబంధించిన నంబర్లు

4. సాధారణ పిన్ నెంబర్లు :
సైబర్ భద్రతా నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్లు ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే పిన్‌ నెంబర్లుగా గుర్తించారు. ఇలాంటి పిన్ నెంబర్లను కొన్ని సెకన్లలో హ్యాక్ చేయవచ్చు, అందుకే ఎప్పుడూ మీ పిన్‌గా ఇలాంటి నెంబర్లను సెట్ చేసుకోవద్దు.

  • 1234
  • 0000
  • 2580
  • 1212
  • 6969
  • 9999

సేఫ్టీ పిన్‌ ఇలా రెడీ చేసుకోండి :
మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ పిన్‌ను ఎల్లప్పుడూ యూనిక్ గా ఉండేలా సెట్ చేసుకోండి. మీ పిన్ నెంబర్ ఎప్పుడూ కూడా పుట్టినరోజు, ఫోన్ నంబర్‌ మాదిరిగా ఉండకూడదు. ఈజీగా ప్యాట్రన్స్ నివారించండి. 6 నెలల నుంచి 12 నెలల్లో మీ పిన్ నంబర్‌ను మారుస్తూ ఉండాలి.