Donald Trump Says Elon Musk Is A Good Man But He Is Staying Away From Twitter (1)
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) బిలియనీర్ ఎలన్ మస్క్‌పై ప్రసంశలు కురిపించాడు. తనను శాశ్వతంగా బ్యాన్ చేసిన ట్విట్టర్‌ను టేకోవర్ చేసినందుకు అభినందనలు తెలిపారు ట్రంప్. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ చాలా మంచోడని అన్న ట్రంప్.. అయినా తన ట్రూత్ సోషల్ యాప్ (Truth Social) వదిలి ట్విట్టర్ లోకి వచ్చే ప్రసక్తే లేదన్నాడు. ఇప్పటివరకూ ట్విట్టర్ ట్రంప్ అకౌంట్ పై బ్యాన్ ఎత్తేయలేదు. ఇప్పుడు ట్విట్టర్ చేతులు మారిపోయింది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిపోయింది.
ఇంకేముంది.. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ తిరిగి వెనక్కి తెచ్చుకోవాలే అనుకున్నారు ట్రంప్ రిపబ్లికన్లు.. ఇదే సరైన సమయమని, మీ ట్విట్టర్ అకౌంట్ మీరు తెచ్చుకోమని ట్విట్టర్ వేదికగా కోరారు. అందుకు మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నేను పోనేపోను అంటున్నాడు. నా ట్రూత్ సోషల్ యాప్ ఉండగా.. నేను ఎందుకు ట్విట్టర్ అకౌంట్ వాడాలి అన్నట్టుగా ఉంది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ ఆయన ట్విట్టర్‌ను శాశ్వతంగా మూసేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Donald Trump Says Elon Musk Is A Good Man But He Is Staying Away From Twitter
అయితే ట్విట్టర్ ప్లాట్ ఫాంను SpaceX అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ కూడా తిరిగి వచ్చినట్టేనని రిపబ్లికన్లు భావించారు. అందులోభాగంగానే రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతిలో ఉందని, ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ తిరిగి పునరుద్ధరిస్తారని ప్రచారం జరుగుతోంది.
ట్రంప్ స్వయంగా సమాధానమిస్తూ.. తాను తిరిగి ట్విట్టర్‌లో అకౌంట్ తెరిచేది లేదని స్పష్టం చేశారు. ఎలన్ మస్క్ చాలా మంచివారంటూనే.. తాను మాత్రం తిరిగి ట్విట్టర్ అకౌంట్ తెరిచేది లేదని ట్రంప్ తేల్చి చెప్పేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడుతూ.. ట్విట్టర్ అకౌంట్ మళ్లీ తెరిచేది లేదన్నారు. నేను నా ట్రుథ్ సోషల్ (Truth Social)లోనే ఉంటానని స్పష్టం చేశారు.