Elon Musk : ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం..!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ వేదికగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు.

Elon Musk New University,

Elon Musk new university : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందిన టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు.  ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్‌ టెక్నాలజీ, స్పేస్‌ టూరిజం, డ్రైవర్‌ లెస్‌ కార్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఎలన్ మస్క్.. సరికొత్తగా మొదటిసారిగా అకాడమిక్ రంగంపై ఫోకస్ పెట్టారు. ట్విట్టర్ వేదికగా ఇప్పుడు విద్యపరమైన అంశాలపై మస్క్ స్పందించారు.

కొత్త యూనివర్శిటీని ప్రారంభించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. Texas Institute of Technology & Science పేరుతో కొత్త యూనివర్శిటీని స్థాపించాలని ఉందని తెలిపాడు. Texas Tech Collegeని స్థాపించి తన ప్లాన్ అప్ యాక్షన్ మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. విద్యారంగంలోకి అడుగుపెట్టాలనే మస్క్ ఆలోచనను నెటిజన్లు కూడా స్వాగతిస్తున్నారు.
Floki Inu : కుక్క ఫొటో షేర్ చేసిన ఎలన్ మస్క్.. భారీగా పెరిగిన ‘ఫ్లోకి’ ధర

ఎలన్‌ మస్క్‌ అనుకున్నది ఆచరణలో పెట్టడం.. అదే ఆయన విజయ రహస్యం.. 20ఏళ్ల క్రితమే ఎలక్ట్రిక్‌ వాహనాలదే భవిష్యత్తు అంటూ అంచనా వేశాడు. స్పేస్‌ టూరిజంకి మంచి ఫ్యూచర్‌ ఉందని చెప్పింది ఆయనే.. అందులోనూ భారీ పెట్టుబడులు పెట్టింది కూడా ఆయనే.. డ్రైవర్‌ లెస్‌ కారు కోసం ఎలన్‌ మస్క్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అది ఇప్పటికి పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు.


అయితే ఈ క్రమంలోనే మస్క్ తన ఆలోచనలకు తగ్గట్టుగా యువతను కాలేజీ డేస్‌ నుంచే ఒక ట్రాక్ లో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ వర్సిటీని ఎలన్‌ మస్క్‌ స్థాపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎలన్‌మస్క్‌కి చెందిన టెస్లాతో పాటు స్పేస్‌ఎక్స్‌ కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. టెస్లా కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ సోమవారం నాటికి వన్‌ ట్రిలియన్‌ డాలర్లను దాటేసింది. ఎలన్‌ మస్క్‌ సంపద ఏకంగా 300 బిలియన్లకు చేరుకుంది.
Mukesh Ambani: ప్రపంచ ధనికుల జాబితాలో అంబానీ.. ఎలన్ మస్క్, బెజోస్‌ల తర్వాత