Elon Musk AI : 2029 నాటికి మనుషుల కన్నా ఏఐ చాలా తెలివైనదిగా మారుతుంది : ఎలన్ మస్క్!

Elon Musk : 2029 నాటికి ఏఐ మానవులను అధిగమిస్తుందని టెస్లా బాస్ ఎలన్ మస్క్ అంచనా వేశారు. గతంలోనే ప్రఖ్యాత ఫ్యూచరిస్ట్, శాస్త్రవేత్త రే కుర్జ్‌వీల్ ఏఐ గురించి సంచలన వాస్తవాలను వెల్లడించారు.

Elon Musk AI : రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు (AI) మానవ మేధస్సును అధిగమిస్తుందా? ఏఐ టెక్నాలజీతో మానవాళికి ముప్పు వాటిల్లనుందా? ఇలాంటి అనేక ఊహాగానాలు అనేక దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, ఫ్యూచరిస్టులు ఏఐ చర్చకు సంబంధించిన అనేక సార్లు ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఏఐ మానవులను ఎలా భర్తీ చేస్తుందనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ నుంచి జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ అయిన (ChatGPT) రాకతో ఈ చర్చ మరింత తీవ్రమైంది. జనరేటివ్ ఏఐ మొదట్లోనే ప్రభంజనం సృష్టించింది. దీనిపై టెక్ నిపుణుల్లో ఆందోళనలను లేవనెత్తింది. ఇప్పుడు గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు ప్రస్తుతం తమ సొంత లాంగ్వేజీ మోడల్స్ రూపొందించడానికి, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను మెరుగుపరచడానికి పోటీపడుతున్న పరిస్థితి నెలకొంది.

Read Also : Krutrim ChatGPT : ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ‘కృత్రిమ్ ఏఐ’.. మన భారత చాట్‌జీపీటీ ప్రత్యేకతలేంటో తెలుసా?

ఈ వేగవంతమైన పురోగతిని పరిగణనలోకి తీసుకుంటే.. టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఇప్పుడు మానవుల కన్నా ఏఐ మరింత తెలివైనదిగా మారే కాలక్రమం ఎంతో దూరంలో లేదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, 2029 చివరి నాటికి ఏఐ మొత్తం మానవ జాతి మేధస్సును అధిగమిస్తుందని పేర్కొన్నారు.

1999లోనే ఏఐ గురించి అంచనా వేసిన కుర్జ్‌వీల్ :
పోడ్‌కాస్టర్ జో రోగన్, ప్రఖ్యాత ఫ్యూచరిస్ట్ రే కుర్జ్‌వీల్ మధ్య ఇటీవలే ఏఐ గురించి తీవ్రంగా చర్చ జరిగింది. 2029 నాటికి ఏఐ మానవ-స్థాయి మేధస్సును సాధిస్తుందని కుర్జ్‌వెయిల్ నొక్కిచెప్పారు. కుర్జ్‌వీల్ విశ్లేషణ ఆధారంగా.. మానవులు గణన శక్తి, అల్గారిథమిక్ అధునాతనత, డేటా ప్రాసెసింగ్ సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అంచనా వేశారు.

అందువల్ల, ఈ పురోగతులు అనివార్యంగా ఏఐ సిస్టమ్‌లను సరిపోలుతాయని, చివరికి మానవ మేధస్సును అధిగమిస్తాయని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏఐ మానవుల కన్నా తెలివిగా మారడానికి మరో 100 సంవత్సరాలు పడుతుందని ప్రజలు అంచనా వేయవచ్చని కుర్జ్‌వీల్ చెప్పారు. అయితే, ఏఐ ఈ మైలురాయిని మరింత త్వరగా చేరుకోగలదని, బహుశా వచ్చే ఐదేళ్లలోపు జరుగనుందని అంచనా.

Elon Musk smarter than humans

30ఏళ్ల క్రితమే చెప్పానన్న ఫ్యూచరిస్ట్ :
ఆసక్తికరంగా, కుర్జ్‌వీల్ 1999 నాటికే ఏఐ పురోగతిని అంచనా వేశారు. 2029 నాటికి ఏఐ టెక్నాలజీ ఏ వ్యక్తితోనైనా సమానంగా ఆలోచించగలదని కుర్జ్‌వీల్ పోడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి సంవత్సరం జరుగవచ్చునని అందరూ అనుకుంటున్నారు. నిజానికి ఈ విషయాన్ని నేను 1999లోనే చెప్పాను. 2029 నాటికి ఏ వ్యక్తితోనైనా ఏఐ తెలివిగా మారగలదని నేను చెప్పాను. కానీ, 30 ఏళ్లుగా నేను చెప్పింది పూర్తిగా పిచ్చితనమని భావించారు. దీనిపై అప్పట్లోనే చర్చ జరపగా.. అనేకమంది ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. కానీ, అది 2029 నాటికి కాదు. దీనికి ఇంకా 100 సంవత్సరాలు పడుతుందని భావించారు’ అని కుర్జ్‌వీల్ పేర్కొన్నారు.

ఏఐ వల్ల కలిగే సంభావ్య ప్రమాదాలపై తరచుగా బహిరంగంగా మాట్లాడే మస్క్.. మానవుల కన్నా ఏఐ చాలా తెలివైనదిగా మారుతుందని గట్టిగా చెబుతున్నాడు. 2029 నాటికి ఏఐ మానవులందరి సామూహిక మేధస్సును అధిగమించగలదని మస్క్ సూచించాడు. బహుశా వచ్చే ఏడాదిలోనే ఇది ఆరంభం మొదలవుతుందని, 2029 నాటికి, ఏఐ మానవులందరి కన్నా తెలివిగా ఉంటుందని మస్క్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.

కుర్జ్‌వీల్ అంచనా ప్రకారం.. 2029 నాటికి ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తుందా? అంటే.. ఏఐ అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఈ వేగవంతమైన పురోగతి మరెన్నో అవకాశాలు, ముఖ్యమైన సవాళ్లను అందిస్తుంది. ఈ క్రమంలో ఏఐ శక్తిని మంచిగా వినియోగించుకోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఏఐతో వాటిల్లే ప్రమాదాలను తగ్గించడం, ఏఐ అభివృద్ధి మానవాళికి నైతికంగా, ప్రయోజనకరంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Read Also : AI Software Engineer Devin : ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘డెవిన్’ వచ్చేసింది.. సింగిల్ ప్రాంప్ట్‌తో క్షణాల్లో అన్నిపనులు చేసేస్తుంది!

ట్రెండింగ్ వార్తలు