Elon Musk Rival Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏకిపారేసిన మస్క్.. దావాలతో మా అంతరిక్ష యానం ఆగదు!

ప్రపంచ బిలియనీర్లు ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ జెజోస్‌ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. బెజోస్‌పై పరోక్షంగా మస్క్‌ విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ తన నోటికి పనిచెప్పాడు.

Elon Musk Rival Jeff Bezo : ప్రపంచ బిలియనీర్లు ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ జెజోస్‌ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు పరోక్షంగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ తన నోటికి పనిచెప్పాడు మస్క్.. ప్రైవేట్‌ స్పేస్‌ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని స్పేస్‌ఎక్స్‌(SpaceX) ప్రయోగాలను నీరుగార్చేలా చేస్తున్నాడని ఎలన్‌ మస్క్‌ ఆరోపించాడు. 2021 కోడ్‌ కాన్ఫరెన్స్‌లో మస్క్ పరోక్షంగా అమెజాన్ బాస్ ను ఏకిపారేశాడు. జెఫ్.. నీ తరపు లాయర్లు గొప్పవాళ్లు కావొచ్చు. చంద్రుడి చేరుకోవాలనే మా ప్రయత్నాన్ని దావాలతో ఆపలేరని ఇకనైనా తెలుసుకుంటే మంచిది. అంతరిక్ష యానం అనేది నీ అబ్బసొత్తు కాదని గుర్తించుకోండంటూ విరుచుకుపడ్డాడు.  స్పేస్‌ఎక్స్‌, స్టార్‌లింక్‌ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బ్లూ ఆరిజిన్‌ వరుసగా దావాలు వేయడాన్ని ఎలన్‌ మస్క్‌ తీవ్రంగా తప్పుబట్టాడు.
Flipkart Big Billion Days తేదీ మార్పు, అమెజాన్‌కు పోటీగా..

మరోవైపు.. ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై అమెజాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఎలన్‌ మస్క్‌.. నువ్వు కూడా బెజోస్‌ లాంటివాడేనని విషయం మరిచిపోయినట్టున్నావ్ అంటూ సెటైర్ వేసింది. గతంలో స్పేస్‌ఎక్స్‌ (SpaceX) కూడా ఇలానే దావాలు వేసిన విషయం గుర్తులేదా? అంటూ అప్పటి విషయాన్ని గుర్తు చేసింది. దీనికి సంబంధించి డాక్యుమెంట్లను కూడా అమెరికన్‌ టెక్నాలజీ బ్లాగ్‌ ది వర్జ్‌కు అమెజాన్ పంపింది. ఇప్పటివరకూ స్పేస్‌ఎక్స్‌ (SpaceX) వివిధ కోర్టుల్లో 13 దావాలు వరకు వేసింది. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన స్టేట్‌మెంట్ల వివరాలను వెల్లడించింది.

మేమే కాదు.. మీరూ అంతే :
2004 నుంచి అమెరికా ప్రభుత్వం.. నాసా, అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లకు వ్యతిరేకంగా స్పేస్‌ఎక్స్‌ దాఖలు చేసిన అన్ని పిటిషన్ల వివరాలు ఉన్నాయి. అమెజాన్‌ శాటిలైట్‌ డివిజన్‌ ప్రతినిధి ప్రాజెక్ట్ కుయిపర్‌ పేరు మీద ఈ డాక్యుమెంట్లు వర్జ్‌కు అందాయి. దేశీయ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్పేస్‌ఎక్స్‌ కూడా గతంలోనూ ఇదే పని చేసిందిగా.. గుర్తులేదా అంటూ మస్క్ కు అమెజాన్ చురకలు వేసింది. మొత్తం 39 డాక్యుమెంట్లలో 13 పేజీల(PDF) ఫైల్‌ పంపించారని తెలిపింది.

దావాలు మీమే కాదు.. గతంలో మీరూ కూడా దావాలు వేశారు.. ఆ విషయం గుర్తుచేసుకోండి అంటూ అమెజాన్ కౌంటర్ ఇవ్వడంతో.. స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ స్పందించాడు. తమ కంపెనీ వేసిన దావాలను మాత్రం మస్క్  సమర్థించుకున్నాడు. ప్రస్తుత అంతరిక్ష పోటీప్రపంచంలోకి అనుమతించాలనే స్పేస్‌ఎక్స్‌ తరపున దావాలు వేశామంటూ మస్క్ చెప్పుకొచ్చాడు. అయితే బ్లూఆరిజిన్ మాత్రం పోటీపడకుండా దావాలు వేస్తోందని మస్క్ ఆరోపించాడు.
Amazon Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 అక్టోబర్ 4నుంచే

ట్రెండింగ్ వార్తలు